సరుకు పంపిణీ ఏజెన్సీలపై చర్యలు

24 Sep, 2016 22:49 IST|Sakshi
సుల్తాన్‌గూడ అంగన్‌వాడీ కేంద్రంలో రికార్డులు పరిశీలిస్తున్న డీడీ
  •  ఐటీడీఏ డీడీ రామ్మూర్తి
  •  అంగన్‌వాడీ కేంద్రాల తనిఖీ
  •  నిర్వహణ తీరుపై అసంతప్తి
  •  సిబ్బందిపై ఆగ్రహం
  • కెరమెరి : అంగన్‌వాడీ కేంద్రాల్లో గుడ్లతో పాటు ఇతర సరుకులు పంపిణీ చేసే ఏజెన్సీపై చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ డీడీ (డెప్యూటీ డైరెక్టర్‌) రామ్మూర్తి అన్నారు. మండలంలోని సాంగ్వి, పెద్ద సాకడ, ఝరి, మోడి కెరమెరిలోని చందుగూడ, సుల్తాన్‌గూడ, పోచమ్మగుడి, జన్కాపూర్, జైరాంగూడ, ఆంద్‌గూడ గ్రామాల్లోని 13 అంగన్‌వాడీ  కేంద్రాలను ఆయన ఆకస్మీకంగా తనిఖీ చేశారు. విద్యార్థుల హాజరు, గర్భిణీ, బాలింతల నమోదు వివరాలను అడిగి తెలుసుకున్నారు. సుల్తాన్‌గూడ అంగన్‌వాడీ కేంద్రంలో గత నెలలో 1372 గుడ్డు పంపిణీ చేయాల్సి ఉండగా 992 సరఫరా చేశారని, ఝరి కేంద్రంలో కేవలం నెలంతా 10 గుడ్లు పంపిణీ చేయడం, ఇతర కేంద్రాల్లో కూడా ఎక్కడా సరిపడా గుడ్లను సరఫరా చేయకపోవడంతో సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
          దీంతో అందాల్సిన వారికి పౌష్టికాహారం లభించక రక్తహీనత ఏర్పడుతోందని చెప్పారు.  ఎక్కడ కూడా మెనూ పాటించడం లేదన్నారు. రికార్డులు కూడా సరిగా నమోదు చేయడం లేదని అసహనం వ్యక్తం చేశారు. 
    జిల్లా కలెక్టర్‌ దష్టికి సమస్య...
    పలు అంగన్‌వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారాన్ని సక్రమంగా అందించకపోవడాన్ని జిల్లా కలెక్టర్‌ దష్టికి తీసుకెళ్తానని తెలిపారు. పలు అంగన్‌వాడీ కేంద్రాల్లోని విద్యార్థులతో మాట్లాడారు. ఎక్కడా కూడా దుస్తులు  ఇవ్వక పోవడానికి గల కార ణాలను తెలుసుకున్నారు. ఇలాంటి సమస్యలు పునరావతమైతే అంగన్‌వాడీలపై శాఖపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
             అధికారుల పర్యవేక్షణ కొరవడిందని, నిర్వహణ సరిగా లేదన్నారు. అనంతరం తన భర్త మతి చెంది మూడు మాసాలు గడుస్తున్నా నేటికీ వితంతు పింఛన్‌ రావడం లేదని, డెత్‌ సర్టిఫికెటు అడిగితే ఇంటి పన్ను కడితే సర్టిఫికెటు ఇస్తామంటున్నారని చందుగూడ గ్రామానికి చెందిన పార్వతిబాయి డీడీ ఎదుట వాపోయారు. దీంతో ఆయన స్పందిస్తూ ఎంపీడీవోతో మాట్లాడి పింఛన్‌ ఇప్పిస్తాని భరోసానిచ్చారు. కార్యక్రమంలో ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు రాజశ్రీ, జంగుబాయి తదితరులున్నారు. 
     
మరిన్ని వార్తలు