మాట తప్పిన సీఎంకు బుద్ధి చెబుదాం

28 May, 2017 23:15 IST|Sakshi
మాట తప్పిన సీఎంకు బుద్ధి చెబుదాం
- ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ
 
ఆలూరు రూరల్‌/ పత్తికొండ/ఆదోని: ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాటతప్పిన సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆలూరు, ఆదోని పట్టణాల్లో కురుక్షేత్ర సన్నాహక సభలు నిర్వహించారు. పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు.  మాదిగ, మాలల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిచ్చురేపుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయేందుకు శ్రమిస్తానన్నారు. మాదిగల సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మద్దతు తెలపాలని కోరతామన్నారు. ఎస్సీ వర్గీకరణపై  కేంద్రానికి  చంద్రబాబు ఒక సారి కూడా లేఖలు రాయలేదన్నారు. అమరావతిలో జూలై 7వ తేదీన భారీ ఎత్తున కురుక్షేత్ర సభ నిర్వహించి ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు సుబాష్‌చంద్ర, జాతీయ అ«ధికార ప్రతినిధి కెవి. వెంకట రమణ, బుడగజంగాల జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు  పులికొండ, రాముడు, రామకొండ వన్నూరుబాషా, రామంజినేయులు, శ్రీరాములు, రవికుమార్‌ పాల్గొన్నారు.
 
మరిన్ని వార్తలు