గవర్నర్‌కు ఘన స్వాగతం

22 May, 2017 22:14 IST|Sakshi
గవర్నర్‌కు ఘన స్వాగతం

అనంతపురం న్యూసిటీ:

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్‌ ఇ.ఎస్‌.ఎల్‌.నరసింహన్‌ రెండు రోజుల పర్యటనలో భాగంగా సోమవారం అనంతపురం చేరుకున్నారు. ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో మంత్రి కాలవ శ్రీనివాసులు, మేయర్‌ స్వరూప, కలెక్టర్‌ జి.వీరపాండియన్, ఎస్పీ ఎస్‌.వి.రాజశేఖరబాబు, జేసీ–2 సయ్యద్‌ ఖాజామొహిద్దీన్‌లు గవర్నర్‌కు పుష్పగుచ్ఛం అందించి ఘనంగా స్వాగతం పలికారు. గవర్నర్‌కు మేయర్‌ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం పోలీసుల నుంచి గవర్నర్‌ గౌరవ వందనం స్వీకరించారు. కాసేపటికి మంత్రి పరిటాల సునీత గవర్నర్‌కు పుష్పగుచ్చానందించారు. ఆర్‌అండ్‌బీ అతిథి గృహం వద్ద కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

నేటి పర్యటనిలా..

గవర్నర్‌ నరసింహన్‌ మంగళవారం గార్లదిన్నె మండలం ముకుందాపురంలో పర్యటించనున్నారు. ఉదయం 9.30 నుంచి ‘పంట సంజీవని’ ఫారంపాండ్‌ పనులను పరిశీలిస్తారు. 10 నుంచి 10.30 గంటల వరకు మల్చింగ్‌ పద్ధతిలో సాగుచేసిన పంటలను పరిశీలిస్తారు. 10.30 నుంచి 11 గంటల వరకు బిందు, తుంపర సేద్యం ద్వారా వినూత్నంగా సాగు చేసిన పండ్ల తోటలను సందర్శిస్తారు. 11 నుంచి 11.45 గంటల వరకు గార్లదిన్నెలో భూగర్భ జలాలను కొలిచే ఫిజో మీటర్లను పరిశీలిస్తారు. 11.45 గంటలకు గార్లదిన్నె నుంచి అనంతపురం బయలుదేరుతారు. 12 గంటలకు ఆర్‌అండ్‌బీ అతిథి గృహం చేరుకుంటారు. తిరిగి సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌కు బయలుదేరుతారు. 

మరిన్ని వార్తలు