విద్యార్థుల్లో పిరికితనం నూరిపోయకండి

25 Jan, 2017 22:47 IST|Sakshi
విద్యార్థుల్లో పిరికితనం నూరిపోయకండి
కలెక్టర్‌ భాస్కర్‌ 
ఏలూరు సిటీ: ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్ళి రాణించేలా భావిభారత పౌరులను తీర్చిదిద్దాలే తప్ప వారిలో పిరికితనం, కష్టపడకుండా జీవించే మనస్తత్వాన్ని ప్రొత్సహించవద్దని కలెక్టరు కాటంనేని భాస్కర్‌ కళాశాల అధినేతలకు హితవు పలికారు. కలెక్టరేట్‌లో ఇంటర్మీడియట్‌ విద్యార్థులకు జంబ్లింగ్‌ సౌకర్యం వద్దని దానివల్ల విద్యార్ధులు ఎంతో కష్టపడాల్సి వస్తుందని, పలు కళాశాలల అధిపతులు విద్యార్ధులకు కలెక్టరకు అందచేసిన వినతిపత్రంపై కలెక్టరు స్పందించారు. పారదర్శకంగా జంబ్లింగ్‌ విధానాన్ని నిర్వహిస్తుంటే అభ్యంతరం ఏమిటని కలెక్టరు ప్రశ్నించారు. ఇదేనా మన పిల్లలకు పిరికితనం నూరిపోయడం ? కష్టపడవద్దని చెప్పడం మంచిది కాదని ఒక కళాశాలలో చదువుతూ మరొక కళాశాలకు వెళ్ళి పరీక్ష వ్రాయమంటే బాధపడిపోతే ఎలా ? ఉన్నత చదువులు కోసం ఉద్యోగాలు కోసం భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఏ దేశానికైనా వెళ్ళి రాణించే స్దాయిలో మన యువతను తీర్చిదిద్దాలే తప్ప ప్రతిదానికి కుంఠిసాకులు చెప్పి యువతలో ఒక విధమైన నైరాస్యతకు చొప్పించడం మంచిది కాదన్నారు.  తాను కూడా అనేక పరీక్షలు వ్రాశానని ఆనాడు కష్టపడి చదవబట్టే ఈ రోజు కలెక్టరు హోదాలో ఇక్కడ పనిచేస్తున్నానని చదివేటప్పుడు మరింత కష్టపడి చదివేలా తల్లిదండ్రులు, కళాశాల యాజమాన్యం ప్రొత్సాహించాలే తప్ప నిరాశ, నిస్పృహలను కల్పించవద్దన్నారు.
 
మరిన్ని వార్తలు