ఎప్పుడు ఏమి జరిగింది?

9 Aug, 2016 01:43 IST|Sakshi
షాద్‌నగర్‌ : సంచలనం సృష్టించిన షాద్‌నగర్‌లో నయీం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి సోమవారం ఉదయం ఎనిమిది నుంచి రాత్రి పది గంటల వరకు వివిధ పరిణామాలు సంభవించాయి. 
– ఉదయం 7.50 గంటలకు మిలీనియంటౌన్‌షిప్‌ కాలనీకి పోలీసులు చేరుకున్నారు
– 8 గంటలకు నయీం నివాసగృహానికి ఎస్పీ రెమా రాజేశ్వరీ, ఏఎస్పీ కల్మేశ్వర్‌ రాక
– 8.05కు కాలనీవాసులు బయటకు రావద్దంటూ ఆదేశాలు 
–8.10కు నయీం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు
– 8.15కు పోలీసుల కదలికలతో కార్లో పారిపోయేందుకు యత్నించి కాల్పులు జరిపిన డ్రైవర్, నయీం. ప్రతిగా కాల్పులు జరిపిన పోలీసులు. 15నిమిషాల పాటు కొనసాగిన ఎదురు కాల్పులు
–8.17కు పారిపోయిన కారు డ్రైవర్‌ 
–8.17 నుంచి 8.30 వరకు పోలీసులకు నయీంకు మధ్య ఎదురుకాల్పులు. 
– 8.35కు కాలనీలోని పార్క్‌వద్ద మృతదేహం గుర్తింపు 
– 8.35 నుంచి పది గంటల వరకు సంఘటన స్థలానికి సమీపంలోని నివాస గృహంలో సోదాలు. నయీం భార్యాపిల్లలతోపాటు ప్రధాన అనుచరులను అదుపులోకి తీసుకున్న పోలీసులు 
– 10.30కు సంఘటన స్థలానికి చేరుకున్న హైద్రాబాద్‌ రేంజ్‌ డీఐజీ అకూన్‌సబర్వాల్‌ 
– 11.30 వరకు సంఘటన స్థలాన్ని పరిశీలించి ఎన్‌కౌంటర్‌ పూర్వపరాలను తెలుసుకున్న డీఐజీ
– 11.30 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి భారీగా పోలీసు బలగాల తరలింపు. 
– ఒంటి గంటకు మీడియాకు నయీం ఎన్‌కౌంటర్‌లో మృతి చెందాడని అధికారికంగా ప్రకటించిన ఎస్పీ రెమా రాజేశ్వరి 
– మధ్యాహ్నం 1.30 నుంచి రెండు వరకు నయీం ప్రయాణించిన కారు పరిశీలన. సంఘటన స్థలంలో లభించిన ఆధారాలను భద్రపరిచిన పోలీసులు
– 2.30 నుంచి 3.30 వరకు మృతదేహాన్ని పంచనామా కోసం సంఘటన స్థలాన్ని పరిశీలించిన తహసీలార్‌
– మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 4.30 వరకు సంఘటన స్థలంలో పడి ఉన్న ఏకే–47 తుపాకీ, నయీం ఉపయోగించిన బుల్లెట్లను భద్రపరిచిన పోలీసులు 
– ఐదు గంటలకు మృతదేహానికి పంచనామా. 5.30 గంటలకు పోస్టుమార్టం కోసం షాద్‌నగర్‌ ఏరియా ఆస్పత్రికి తరలింపు 
– రాత్రి తొమ్మిది గంటల వరకు ఆస్పత్రిలోనే మృతదేహం
– నయీం బంధువులకు పోస్టుమార్టం కోసం సమాచారమిచ్చిన పోలీసులు
– 9.30 వరకు ఎవరూ రాకపోవడంతో పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు
– 10 గంటల నుంచి మార్చురీలోనే నయీం మృతదేహం
మరిన్ని వార్తలు