నమాజ్‌ చేస్తూనే..

14 Sep, 2016 00:47 IST|Sakshi
నమాజ్‌ చేస్తూనే..

కోవెలకుంట్ల: పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన ఇస్మాయిల్‌(60) అనే వ్యక్తి మంగళవారం గుండెపోటుతో మతి చెందాడు. బక్రీద్‌ పండుగ  సందర్భంగా  నమాజ్‌ చేసుకునేందుకు ముదిగేడు చౌరస్తాలోని ఈద్గా వద్దకు వెళ్లి ప్రార్థన చేసుకుంటున్న సమయంలో గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. తోటి ముస్లింలు చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించేలోపు మతి చెందాడు. మతుడికి భార్య, ముగ్గురు కుమారులు సంతానం. పండుగ రోజున ఈద్గాకు వెళ్లిన ఇస్మాయిల్‌ మత్యువాత పడటంతో కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి.
 

మరిన్ని వార్తలు