తెల్లకార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం

10 Jul, 2017 02:14 IST|Sakshi

ఇక అన్నింటికీ ఆధారం అదే
ఆదాయ ధ్రువీకరణ  పత్రంతో పనిలేదు
విద్యార్థులు, రైతులకు తప్పిన ఇబ్బందులు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం


కోవూరు: సంక్షేమ పథకాలకు సంబంధించి రైతులకు, విద్యార్థులకు ఇక నుంచి ఆదాయ ధ్రువీకరణ పత్రం అవసరం లేదు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం జీఓ 229 జారీ చేరసింది. లబ్ధిదారులు దారిద్య్ర రేఖకు దిగువన ఉన్నవారు అని చెప్పడానికి తెల్లరేషన్‌ కార్డే ఆధారమని ప్రభుత్వం పేర్కొంది. ప్రస్తుతం పాఠశాలలు, కళాశాలల్లో చేరే విద్యార్థులు ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీ కార్పొరేషన్‌ రుణాలు, ఇతర ప్రభుత్వ పథకాలకు దరఖాస్తు చేసుకుంటే.. వారి నుంచి తెల్లరేషన్‌ కార్డును ఆధారంగా తీసుకోవాలని ఆదేశాల్చింది. తహసీల్దారు లేదా డిప్యూటీ తహసీల్దారు  జారీ చేసే ఆదాయ ధ్రువీకరణ పత్రం కూడా నాలుగేళ్ల పాటు చెల్లుబాటు అవుతుంది.

బీపీఎల్‌కు దిగువన ఉన్నవారు తెల్లరేషన్‌ కార్డు కలిగి ఉంటే వారికి ఆ కార్డే ఆదాయ ధ్రువీకరణ పత్రం అవుతుంది. ఒకవేళ తెల్లరేషన్‌ కార్డు లేకపోతే అలాంటి వారికి ఆదాయ ధ్రువీకరణ పత్రం మంజూరు చేస్తారు. స్కాలర్‌షిప్‌ లేదా ఇతర అవసరాలకు సంబంధించి బీపీఎల్‌ పరిమితికి మించి ఉంటే ధ్రువీకరణ పత్రం అడగవచ్చు. ఉద్యోగాలకు సంబం«ధించిన విషయాల్లో ప్రభుత్వ, ప్రైవేటు సంబంధించిన వారు ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. రైతులకు రుణాల పొడిగింపు విషయంలో బ్యాంకులు ఆదాయ ధ్రువీకరణ పత్రం అడగరాదు. ఏ శాఖకు చెందిన అధికారులైనా ఆదాయ ధ్రువీకరణ పత్రం పరిశీలన జరిగిన తరువాత ఒరిజనల్‌ వారి వద్ద ఉంచుకోకుండా తిరిగి ఇచ్చేయాలి.

మరిన్ని వార్తలు