దుగ్గరాజుపట్నం పోర్టు ఏమైంది?

17 Aug, 2016 22:39 IST|Sakshi
దుగ్గరాజుపట్నం పోర్టు ఏమైంది?
 
  • బీజేపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి సురేష్‌రెడ్డి
నెల్లూరు(బారకాసు) : దుగ్గరాజుపట్నం పోర్టు విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పిల్లిమొగ్గలు వేస్తోందని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపురెడ్డి సురేష్‌రెడ్డి అన్నారు. నెల్లూరులోని తన స్వగృహంలో బుధవారం ఆయన విలేకరల సమావేశంలో మాట్లాడారు. కేంద్రప్రభుత్వం విభజన హామీలను అమలు చేయడంలేదని పదేపదే టీడీపీ నేతలు ఆరోపించడం సరికాదన్నారు. పోర్టును మంజూరుచేసేందుకు కేంద్రం సిద్ధంగా ఉందన్నారు. అవసరమైన భూమిని సమీకరించడంతో పాటు పూర్తిస్థాయి నివేదికను కేంద్రానికి పంపడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేస్తోందన్నారు. రోజుకో ప్రకటన చేస్తూ ప్రజలను అయోమయానికి గురిచేస్తున్నారన్నారు. కేంద్రం ఏంచేయడంలేదని ప్రశ్నిస్తున్న టీడీపీ నేతలు పోర్టు గురించి ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు. నాయకులు మొద్దు శ్రీనివాసులు, బాలిరెడ్డి మారుతీకుమార్‌రెడ్డి, అన్నం శ్రీనివాసులు, బండారు సురేష్‌నాయుడు, వి.శ్రీనివాసులురెడ్డి పాల్గొన్నారు.
మరిన్ని వార్తలు