ప్రత్యేక ప్యాకేజీ లోకేశ్ జేబు నింపడానికా..!

11 Oct, 2015 09:26 IST|Sakshi
ప్రత్యేక ప్యాకేజీ లోకేశ్ జేబు నింపడానికా..!

గుంటూరు: ఆంధ్రప్రదేశ్ భవిష్యత్ తరాలకోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి దీక్ష చేస్తున్నారని పలువురు విద్యార్థులు పేర్కొన్నారు. నాగార్జున యాదవ్ అనే విద్యార్థి మాట్లాడుతూ  వైఎస్ జగన్ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా భావి విద్యార్థి తరం, యువతరం, సమస్త ఆంధ్ర ప్రజానీకం బాగుండాలని ఉద్దేశంతో నిరవధిక నిరాహార దీక్ష చేస్తుంటే ఎందుకు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఇప్పటికే ఆయనకు వైద్య పరీక్షలు పూర్తయ్యాయని, కీటోన్స్ పాజిటివ్గా వచ్చే అవకాశం ఉందని, కిడ్నీలు ప్రభావితమయ్యే అవకాశం ఉందని, పల్స్ పోడిపోతున్నాయని సమాచారం వస్తుందని, ఆయనకు ఏమైనా అయితే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.

ప్రత్యేక హోదా గురించి ప్రశ్నిస్తుంటే ప్రత్యేక ప్యాకేజీ గురించి బాబు మాట్లాడుతున్నారని, అది ఎందుకు ? లోకేశ్ జేబు నింపడానికా అని ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వం మొద్దు నిద్ర పోవడం సరికాదని చెప్పారు. ఇప్పటికే దీక్ష ఐదో రోజుకు చేరుకుందని, ఆయన ఆరోగ్యం తీవ్రంగా క్షీణిస్తోందని, అయినా ప్రభుత్వం నిమ్మకుండా ఉండటం వెనుక దురుద్దేశం ఏమిటని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారని ప్రశ్నించారు. వైఎస్ జగన్ను ఏమైనా చేయాలనుకుంటున్నారా అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని వేదికనుంచి ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం స్పందించకుంటే విద్యార్థిలోకం ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తుందని హెచ్చరించారు.
 

మరిన్ని వార్తలు