వరకట్నానికి వివాహిత బలి

2 Dec, 2016 12:24 IST|Sakshi
జగిత్యాల: వరకట్నానికి ఓ వివాహిత బలైంది. ఈ సంఘటన గొల్లపల్లి మండలకేంద్రంలోని గౌతమ్ విద్యా మందిరం సమీపంలో చోటు చేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న స్వప్న(25)కు ఏడున్నరేళ్ల క్రితం రాజు అనే వ్యక్తితో ప్రేమ వివాహం జరిగింది. వీరికి ఐదేళ్ల కుమారుడున్నాడు. పెళ్లి జరిగిన నాటి నుంచి వరకట్నం కోసం భర్త, అత్తమామలు వేధిస్తున్నారు. 
 
15 రోజుల క్రితం కూడా ఈ విషయమై గొడవలు జరిగాయి. శుక్రవారం ఉదయం చూసే సరికి స్వప్న ఉరికి వేలాడుతూ కనిపించింది. భర్త, అత్తమామలు కలిసి ఉరివేసి చంపి ఆత్మహత్యగా చిత్రీకరించారంటూ మృతురాలి తల్లి చుక్క లక్ష్మీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని వార్తలు