కట్టుకున్నోళ్లే కడతేర్చారు

29 Jul, 2016 22:18 IST|Sakshi
కట్టుకున్న భర్తలే ఆ మహిళలపాలిట కాలయములయ్యారు. అదనపు కట్నం కోసం ఒకడు, కుటుంబ తగాదాలతో మరొకడు తమ భార్యలను పొట్టనబెట్టుకున్నారు. జిల్లాలోని పాతఇస్సిపేట, ఉప్పరపల్లిలో జరిగిన ఈ ఘటనలు బాధిత కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి.
 
పురుగుల మందు తాగించి.. 
మొగుళ్లపల్లి : అదనపు కట్నం కోసం కొన్నాళ్లుగా భార్యను హింసిస్తున్న ఓ వ్యక్తి చివరికి ఆమెను హింసించి, పురుగుల మందు తాగించి హత్య చేసిన సంఘటన మండలంలోని చింతలపల్లి శివారు పాతఇస్సిపేటలో శుక్రవారం జరిగింది. కుటుం బ సభ్యులు, పోలీసుల కథనం ప్రకారం... పాతఇస్సిపేట గ్రామానికి చెందిన నేర్పటి మొగిలి, స్వరూ ప దంపతుల కుమార్తె స్వప్నను అదే గ్రామానికి చెందిన జన్నె పరమేశ్వర్‌ తొమ్మిదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో వారికి ఇద్దరు కుమారులు కలిగారు. గత రెండేళ్లుగా భర్త పరమేశ్వర్‌ అదనపు కట్నం కోసం స్వప్నను హింసిస్తున్నాడు. ఈ క్రమంలో పలుమార్లు పెద్దమనుషుల మధ్య పంచాయితీ లు కూడా జరిగాయి. గురువారం రాత్రి ఇంటికి వచ్చిన పరమేశ్వర్‌ అదనపు కట్నం కోసం భార్యను తీవ్రంగా కొట్టాడు. అనంతరం పురు గుల మందు తాగించాడు. తర్వాత ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతిచెందింది. తల్లి స్వరూప ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్సై సురేందర్‌ తెలిపారు.
 
కిరోసిన్‌ పోసి నిప్పంటించి.. 
చెన్నారావుపేట : కుటుంబ కలహాలతో ఓ వ్యక్తి తన భార్యపై కిరోసిన్‌ పోసి నిప్పటించడంతో తీవ్ర గాయాలపాలై ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ఉప్పరపల్లి గ్రామానికి చెందిన కుక్కల రాజుకు, నర్సంపేట మండలంలోని నాగుర్లపల్లి గ్రామానికి చెందిన కడబోయిన సదయ్య కూతురు సరిత(28)తో పదేళ్ల క్రితం వివాహమైంది. వీరి దాంపత్య జీవితంలో  ఇద్దరు కుమార్తెలు జన్మించారు. కుటుంబ తగాదాలతో సోమవారం రాత్రి భార్య సరితపై రాజు కిరోసిన్‌ పోసి నిప్పంటించాడు. ఆమె అరుపులను గమనించిన చుట్టుపక్కల వారు మంటలార్పి ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతిచెందింది. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పులి వెంకట్‌గౌడ్‌ తెలిపారు. ∙ 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా