ఏటూరునాగారంలో వన్యప్రాణి డివిజన్‌ కార్యాలయం

18 Sep, 2016 00:11 IST|Sakshi
ఏటూరునాగారంలో వన్యప్రాణి డివిజన్‌ కార్యాలయం
  • నాలుగు రేంజ్‌లకు కలిపి ఏర్పాటు
  • రక్షణ కోసం మరిన్ని చర్యలు
  • ఏటూరునాగారం : ఏటూరునాగారంలో వన్యప్రాణి విభాగం జిల్లా డివిజనల్‌ కార్యాలయం ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాల పునర్విభజనలో భాగంగా ఏటూరునాగారాన్ని వన్యప్రాణి, అడవుల రక్షణ కోసం ప్రత్యేక హోదా కలిగిన అధికారితోపాటు కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయనున్నారు. గతంలో ఏటూరునాగారంలో ఉన్న అటవీశాఖ టెరిటోరియల్‌ రేంజ్‌ ఆఫీస్, వన్యప్రాణి రేంజ్‌ ఆఫీస్, పస్రా, తాడ్వాయి రేంజ్‌ కార్యాలయాలు వరంగల్‌ నార్త్‌ డీఎఫ్‌ఓ కింద పనిచేసేవి. ఇప్పుడు జయశంకర్‌ జిల్లా ఏర్పడుతుండటంతో ఏటూరునాగారాన్ని ప్రత్యేక డివిజన్‌గా ఏర్పాటు చేసి ఫారెస్ట్‌ డిస్టిక్ట్ర్‌ ఆఫీసర్‌ (ఎఫ్‌డీఓ) అధికారిని కూడా నియమించనున్నారు. దీంతో ఈ కార్యాలయం పరిధిలో తాడ్వాయి, ఏటూరునాగారం, ఆకులవారి ఘ ణపురం, పస్రాలోని రేంజ్‌ అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఏజెన్సీలో వన్యప్రాణి, టెరిటోరియల్‌ అనే రెండు శాఖలు అటవీశాఖ పరిధిలో ఉండేవి. నూతన జిల్లా పరిధిలోని ఏ జెన్సీ మండలాలైన తాడ్వాయి, పస్రా, ఏటూరునాగారంను వన్యప్రాణి విభాగంగా ప్రకటించనున్నారు. దీనివల్ల ఏజెన్సీలోని అడవులతోపాటు జంతువుల సంరక్షణ కూడా ఉంటుందని ఈ మార్పులు చేపట్టారు. నలుగురు రేంజ్‌ అధికారులు, ఒక సబ్‌ డీఎఫ్‌ఓ, ఒక ఎఫ్‌డీఓ అధికారులు ఉంటారని వెల్లడించారు.
     
    పటిష్టంగా అమలు కానున్న అటవీ చట్టాలు
    ప్రస్తుత రేంజ్‌ అంతా వన్యప్రాణి విభాగం పరి ధిలోకి రాగా అటవీశాఖ చట్టాలు పట్టిష్టంగా అమలు కానున్నాయి. జంతువుల సంఖ్య 15 సంవత్సరాల్లో ఘణనీయంగా తగ్గింది. పులు లు, సింహాలు, దుప్పి, జింక, కొండ గొర్రెలు, ఎలుగుబంటి, మెకం వంటి వన్యప్రాణులు కానరాకుండా పోతున్నాయి. ప్రధాన కార్యాలయం స్థానికంగా ఉండడం వల్ల అధికారు లు, సిబ్బంది స్థానికంగా ఉంటూ సంరక్షణకు ప్రత్యేక శ్రద్ధ చూపే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ప్రధాన కార్యాలయం కోసం ఇప్పటికే చర్యలు చేపట్టారు. గతంలో ఉన్న భవనాలకు మరింత సౌకర్యాలు పెంచే దిశగా అధికారులు అడుగులు వేస్తున్నారు.  
మరిన్ని వార్తలు