మల్లాది విష్ణుని కోర్టులో హాజరుపరిచిన పోలీసులు

8 Jan, 2016 17:19 IST|Sakshi

విజయవాడ : కల్తీ మద్యం కేసులో అరెస్ట్ అయిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణును శుక్రవారం పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. అంతకుమందు ప్రభుత్వ ఆసుపత్రిలో మల్లాది విష్ణుతోపాటు అతడి సోదరుడు శ్రీనివాస్కి వైద్యులు వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత వారిద్దరిని కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తరలించారు.  ఆ క్రమంలో వారిద్దరి నుంచి పోలీసులు వేలిముద్రలు సేకరించారు.  నకిలీ మద్యం కేసులో సిట్ అధికారులు మల్లాది విష్ణుని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు