మద్యం షాపులపై ‘సుప్రీం’ ఆదేశాలు పాటించాలి

20 Mar, 2017 00:57 IST|Sakshi
  • ఐద్వా సంఘ సభ్యుల డిమాండ్‌
  • సామర్లకోట (పెద్దాపురం) : 
    హైవే సమీపంలో మ ద్యం షాపులు ఉండరాదన్న సుప్రీం కోర్టు తీర్పును తప్పనిసరిగా పాటించాలని ఐద్వా మహిళా సంఘాల నాయకులు డిమాండ్‌ చేశారు. పట్టణంలో ఈ మేరకు ఆదివారం సంతకాల ఉద్యమాన్ని చేపట్టారు. హైవేలో మద్యం షాపులు ఉన్నందున మద్యం సేవించిన డ్రైవర్లతో ప్రమాదాలు సంభవిస్తున్నాయని ఐద్వా పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు బి.లక్ష్మి, కె. వరలక్ష్మి ఆరోపించారు. బైపాస్, ఏడీబీ రోడ్డు మార్జిన్లలో ఉన్న దాబాలు బార్లుగా మారిపోతున్నా పట్టించుకునే నాథుడే లేడన్నారు. రాత్రిళ్లు దాబాల్లో మద్యం సేవించిన యువకులు తరచూ ఘర్షణలకు దిగుతున్నారన్నారు. అలాగే బెల్టుషాపులను కూడా రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. హైవే, ఏడీబీ రోడ్లకు కిలోమీటరు దూరంలో మద్యం షాపులు ఉండేలా చూడాలని డిమాండ్‌ చేస్తూ సంతకాలు సేకరించారు. సంతకాలతో ఉన్న పత్రాలను సీఎం చంద్రబాబుకు పంపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఎ.మంగతాయారు, దుర్గ, సీహెచ్‌ పార్వతి, బి.దుర్గ పాల్గొన్నారు.
     
మరిన్ని వార్తలు