ఆటో ఇంజన్‌తో కలుపుతీత యంత్రం!

20 Jul, 2016 23:32 IST|Sakshi
ఆటో ఇంజన్‌తో కలుపుతీత యంత్రం!

ఇంజనీరింగ్‌ సునీల్‌రెడ్డి విద్యార్థి నైపుణ్యం
 –గతంలోనూ పలు రకాల వ్యవసాయ యంత్రాలు తయారీ
నాగయ్యగూడెం(మోతె) : మారుతున్న కాలానికి అనుగుణంగా సులువుగా, వేగంగా సాగు చేయడానికి ఎద్దులకు ప్రత్యామ్నాయంగా నూతన యంత్రాలను తయారు చేస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు నేటి యువత. తమకున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి, కొద్దిపాటి ఖర్చుతో కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుడుతున్నారు. ఇదే క్రమంలో ఇంజనీరంగ్‌ విద్యార్థి సునీల్‌రెడ్డి ఆటో ఇంజన్‌తో కలుపుతీసే యంత్రాన్ని తయారు చేశాడు.
తాతయ్య స్ఫూర్తితో...
  మోతె మండలం విభళాపురం గ్రామ పరిధిలో నాగయ్యగూడెంకు చెందిన గోదా సునీల్‌రెడ్డిది వ్యవసాయ ఆధారిత కుటుంబం. తన తాత గోదా వెంకట్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డి వ్యవసాయం చేయడానికి గతంలో పశువులను ఉపయోగించేవారు. వాటి సాయంతో అరక కట్టేవారు. చేళ్లలో కలుపు తీసేవారు. కానీ, రోజురోజుకూ పశు సంపద తగ్గిపోవడం, మారుతున్న కాలానికి అనుగుణంగా  వ్యవసాయంలో అధునాతన పద్ధతులు అందుబాటులోకి వచ్చాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని హోళీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇంజనీరింగ్‌ పూర్తి చేసిన సునీల్‌రెడ్డికి ఓ ఆలోచన తట్టింది. ఎంటెక్‌కు ప్రిపేర్‌ అవుతూనే తన తండ్రి నడిపిస్తున్న విజయలక్ష్మి ఇంజనీరింగ్‌ వర్క్‌ షాప్‌లో ఆటో ఇంజన్‌ సాయంతో కలుపు తీసే టిల్లర్‌ తయారు చేశారు. అంతేకాకుండా వర్క్‌ షాప్‌లో తీరిక సమయంలో విత్తనాలు వేయడానికి, ఎలగడి దుక్కులు దున్నడానికి యంత్ర పరికరాలను తయారు చేశాడు. అంతకుముందు ఫైనలియర్‌నూ   అనేక ప్రయోగాలు చేసి తోటి స్నేహితులను, కళాశాల సిబ్బందిని అబ్బురపరిచాడు.
పరికరాల తయారీ ఇలా...
ఆటో ఇంజన్‌కు డీసిల్‌ ట్యాంక్, కార్బొరేటర్, గేర్‌ రాడ్, కేబుల్స్, ఆటో టైర్లు, ఇనుప ముక్కలు ఉపయోగించి తన ఆలోచన శక్తిని  ఉపయోగించి పంటల్లో కలుపు నివారణకు గుంటక తయారు చేశాడు.  
పనిచేసే విధానం
సునీల్‌రెడ్డి తయారు చేసిన యంత్రంతో పత్తి, ఆముదాలు, కంది, మొక్కజొన్న, సజ్జ ఇతర పంటల్లో కలుపు తీయెుచ్చు. ఎకరం  చేనులో కలుపు తీయడానికి గుంటకు లీటర్‌ డీసిల్‌ మాత్రమే అవసరం అవుతుంది. దీని ద్వారా భూమి లోపల 4నుంచి 6 ఇంచుల లోతు మట్టి పెకిలించవచ్చు.
స్టేట్స్‌కు వెళ్లి ఉన్నత చదువుతో మరిన్ని ప్రయోగాలు చేస్తా..
స్టేట్స్‌కు Ðð ళ్లి ఎంటెక్‌ పూర్తి చేసిన తదుపరి మరిన్ని వ్యవసాయ యంత్ర పరికరాలు తయారు చేసి రైతులకు అందిస్తాను.
                                              – గోదా సునీల్‌రెడ్డి  నాగయ్యగూడెం
 

మరిన్ని వార్తలు