మతాలు లేనిదే అఖండ భారత్‌

11 Aug, 2016 17:19 IST|Sakshi
మతాలు లేనిదే అఖండ భారత్‌

  కుర్చీల కోసమే మతాలు, కులాలు, విభజనలు
⇒  సంస్కృతికి, ప్రకృతికి మతాలు లేవు
⇒  విశ్వ మానవతే స్వాతంత్ర్యం
⇒  విజ్ఞానాన్ని అందించే విద్య కొరవడింది
⇒  అఖండ భారత్‌ దివస్‌ కార్యక్రమంలో ఓయూ రిటైర్డ్‌  తెలుగు విబాగం అధ్యక్షుడు రఘుమన్

పరిగి: ఒకప్పుడు కులమతాలు లేనిదే అఖండ భారతమని..నేటి ఖండాలు, దేశాలన్ని ఒకప్పటి భారతదేశంలో బాగమే..ప్రస్తుత మతాలన్ని ఒకప్పటి హైందవమేనని ఓయూ రిటైర్డ్‌  తెలుగు విబాగం అధ్యక్షుడు రఘుమన్న అన్నారు. గురువారం పరిగి కొప్పుల శారధా గార్డెన్‌లో ఏర్పాటు చేసిన అఖండ భారత్‌ దివస్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడుతూ మతాలన్ని క్రీస్తు పూర్వం 3వేల సంవత్సరాల తరువాత పుట్టినవేనని ఆయన అన్నారు. నేటి మతాలన్ని ఒకప్పటి హైందవంలోనివేనని,  దేశాలన్ని అఖండభారతంలోనివేనని ఆయన వివరించారు. కుర్చీల కోసం అనేక మతాలు, కులాలు, దేశాలు, రాష్ట్రాలుగా విభజన చేస్తున్నారని ఆయన చెప్పుకొచ్చారు.

          సంస్కృతికి, ప్రకృతికి మతాలు లేవని ఇవన్ని మనం సృష్టించుకున్నవేనని తెలిపారు. ఏది ఏమైన మనుషుల చంపుకునే మతాలెందుకని ఆయన ప్రశ్నించారు. ఐకమత్యం..విశ్వమానవత, మానవత్వం ...ఇవే స్వతంత్ర్యం అని తెలిపారు. దేశంలో పనికి వచ్చే విద్య లేదని ఆయన తెలిపారు. ఇపక్పటికీ మెకాలే విద్యావిధానమే కొనసాగుతందని ఆయన గుర్తు చేశారని మనిషిని మనిషిగా మార్చలేని విద్య ఎందుకని ఆయన ప్రశ్నించారు. నేటి గణితం, విజ్ఞాం, ఆరోగ్యం, ఖగోళం, విద్య, ఆరోగ్యం అన్ని నాటి వేదాల్లో ఉన్నవేనని తెలిపారు ఈ కార్యక్రమంలో   బీజేపీ, ఏబీవీపీ నాయకులు బాలకృష్ణారెడ్డి, నర్సింహులు, అనంత్‌రెడ్డి, రాముయాదవ్‌, పెంటయ్యగుప్త, రాంచందర్‌, కృష్ణారెడ్డి ఉప్పలరాజన్న, నర్సింహ్మారావ్‌ ఆనంద్గౌడ్‌, మూడు వేలకుపైగా విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు