జోరు వానలో తడుస్తూ ఆడబిడ్డకు జన్మ!

21 Jun, 2016 19:47 IST|Sakshi
జోరు వానలో తడుస్తూ ఆడబిడ్డకు జన్మ!

హిందూపురం అర్బన్: ఒకవైపు జోరు వాన కురుస్తోంది. ఆ జోరు వానలోనూ తడుస్తూ రోడ్డుపై ఓ గర్భిణి నడుస్తోంది. ఇంతలోనే ఆమెకు పురిటినొప్పులు వచ్చాయి. ఆ వర్షంలో ఎటువెళ్లలేక నడిరోడ్డుపైన ప్రసవించింది. సినిమాను తలపించే ఈ సన్నివేశం మంగళవారం అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పరిగి మండలం శిగుపల్లికి చెందిన నజిమా నిండుగర్భిణి.

వైద్య పరీక్షల నిమిత్తం తల్లితో పాటు హిందూపురం పట్టణానికి ఆమె ఆటోలో వచ్చింది. మధ్యాహ్నం 2.30 గంటలకు జోరుగా వర్షం కురుస్తోంది. తడుస్తూ నడుస్తున్న నజిమాకు పురిటినొప్పులు మొదలయ్యాయి. ఈ క్రమంలో స్థానిక గురునాథ్ సర్కిల్ వద్ద ఒక్కసారిగా కుప్పకూలింది. ఆమె పరిస్థితిని చూసి అక్కడున్న మరోఇద్దరు మహిళలు బెడ్‌షీట్ పట్టుకుని అడ్డుగా నిలిచారు. జోరు వానలోనే నజిమా ఆడశిశువుకు జన్మనిచ్చింది. అక్కడి వారు వెంటనే 108 వాహనంలో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

మరిన్ని వార్తలు