లైంగిక వేధింపులతో వివాహిత ఆత్మహత్య

19 Sep, 2015 17:49 IST|Sakshi

కంచికచర్ల : కృష్ణా జిల్లా కంచికచర్ల మండలంలో దారుణం జరిగింది. మండలంలోని పరిటాలలో ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన వివరాలిలా ఉన్నాయి.. మరియమ్మ అనే వివాహిత పరిటాలలో నివాసం ఉంటోంది. అయితే గత కొంత కాలం నుంచి ఓ యువకుడు ఆమెను లైంగికంగా వేధిస్తున్నాడు. 3 రోజుల క్రితం ఆమె ఆ యువకుడి వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది.

ఈ క్రమంలో శనివారం నాడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడింది. కాగా, పోలీసుల ఆమె ఫిర్యాదును నిర్లక్ష్యం చేయడం వల్లే మరియమ్మ ఆత్మహత్య చేసుకుందని బంధువులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ మృతురాలి బంధువులు పీఎస్ ఎదుట ఆందోళన చేస్తున్నారు.

మరిన్ని వార్తలు