అక్రమంగా మద్యం విక్రయిస్తోన్న మహిళకు రిమాండ్

8 Aug, 2016 19:56 IST|Sakshi

ఓ ఇంట్లో గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తున్న మహిళను భవానీనగర్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఆమె వద్ద నుంచి 19 (20 ఎంఎల్) మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై వీరభద్ర కుమార్ తెలిపిన వివరాల ప్రకారం... ఈదిబజార్ కుమ్మర్‌వాడీ ప్రాంతానికి చెందిన భాగ్యమ్మ (54) గుడుంబా వ్యాపారి. గతంలో గుడుంబా వ్యాపారం నిర్వహిస్తూ ప్రస్తుతం గుట్టు చప్పుడు కాకుండా అక్రమంగా మద్యం విక్రయిస్తుంది.

 

విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎసై ్స ప్రసాద్ రావు సంతోష్‌నగర్ ఏసీపీ వి. శ్రీనివాసులు ఆదేశానుసారం ఇన్‌స్పెక్టర్ బి. శ్రీనివాస్ రావు పర్యవేక్షణలో దాడులు నిర్వహించారు. భాగ్యమ్మ ఇంట్లో సోదాలు చేయగా 19 మద్యం బాటిళ్లు లభించాయి. మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొని భాగ్యమ్మైపై ఎకై ్సజ్ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేసుకొని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. గుడుంబా విక్రయాలు కొనసాగించి పలుమార్లు భాగ్యమ్మ జైలుకు వెళ్లి వచ్చిందని పోలీసులు పేర్కొన్నారు. 200 ఎంఎల్ మద్యం బాటిళ్లు రూ.60 లకు తీసుకొచ్చి రూ.70 విక్రయిస్తుంది.

మరిన్ని వార్తలు