కు.ని. పరే షాన్

27 Feb, 2016 02:00 IST|Sakshi
కు.ని. పరే షాన్

చేవెళ్ల ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిలో కు.ని. (కుటుంబ నియంత్రణ) ఆపరేషన్ల కోసం వచ్చిన మహిళలు అవస్థలు పడ్డారు. డాక్టర్ మోహన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిబిరంలో శుక్రవారం చేవెళ్ల, శంకర్‌పల్లి, మొయినాబాద్, షాబాద్ మండలాలకు చెందిన 104 మంది మహిళలు ఆపరేషన్లకు హాజరయ్యారు. కాగా.. వీరిలో ఇద్దరు వివిధ కార ణాలతో వెనక్కివెళ్లగా.. 102 మంది ఆపరేషన్లు నిర్వహించారు. అయితే ఆస్పత్రి 25 పడకలే కావడంతో కు.ని. ఆపరేషన్లు చేయించుకున్న మహిళలు నేలపైనే పడకున్నారు. వీరికి తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం గమనార్హం.    - చేవెళ్ల రూరల్

మరిన్ని వార్తలు