వైద్యం వికటించి బాలింత మృతి

6 Nov, 2016 13:11 IST|Sakshi
వైద్యం వికటించి బాలింత మృతి

హైదరాబాద్: కూకట్‌పల్లిలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో స్రవంతి అనే బాలింత చికిత్సపొందుతూ శనివారం అర్ధరాత్రి మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే స్రవంతి మృతిచెందిందని మృతురాలి కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆదివారం ఉదయం ఆందోళనకు దిగారు. మెదక్ జిల్లా సదాశివపేట మండలం అనంతసాగరానికి చెందిన స్రవంతి, సంగమేష్ దంపతులు కూకట్‌పల్లి జగద్గిరిగుట్టలో నివాసం ఉంటున్నారు.

స్రవంతి రెండు రోజుల క్రితం సదాశివపేటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో పండంటి బిడ్డను ప్రసవించింది. అయితే ఉమ్మనీరు గర్భసంచిలో చేరడంతో అత్యవసర వైద్యం కోసం హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలోని మరో ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. స్రవంతికి పెన్సిలిన్ ఇంజక్షన్ ఇచ్చినందున వికటించి ఆమె మృతిచెందిందని బంధువులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యంగా వైద్యం చేసిన ఆస్పత్రి సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఆస్పత్రి వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా ఉంది.

మరిన్ని వార్తలు