పోలీస్ స్టేషన్ లో మహిళ ఆత్మహత్యాయత్నం

7 Jul, 2016 15:46 IST|Sakshi
హైదరాబాద్‌: రాజేంద్రనగర్ సర్కిల్ మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్‌లో స్వప్న అనే మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ లక్ష్మీగూడలో రెండు రోజుల క్రితం జీహెచ్‌ఎంసీలో వర్క్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేస్తున్న సురేందర్ తన ఇంట్లో కిరాయికి ఉంటున్న స్వప్నను ఖాళీ చేయాలని కోరాడు. కొంత సమయం ఇవ్వాలని అడిగిన తనపై ఇద్దరు వ్యక్తులు దాడిచేశారని స్వప్న ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో పోలీస్‌స్టేషన్‌లోనే పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసింది. ప్రస్తుతం స్వప్న ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
 
మరిన్ని వార్తలు