వనితోత్సాహం

9 Mar, 2017 00:29 IST|Sakshi
వనితోత్సాహం
మహిళా దినోత్సవం సందర్భంగా జిల్లా అంతటా పలు కార్యక్రమాలతో మహిళలు సందడి చేశారు. జానపదం ... సంప్రదాయ నృత్యాలతోపాటు ఆధునిక హŸయలొలికిస్తూ ఆకట్టుకున్నారు.  ఈ సందర్భంగా వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన వారికి 
జ్ఞాపికలు అందజేశారు.
 
సాక్షి, రాజమహేంద్రవరం : 
మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించే దిశగా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్‌ హెచ్‌ అరుణ్‌కుమార్‌ పిలుపునిచ్చారు. గుండుసూది నుంచి విమానాల తయారీ వరకు మహిళల ప్రాత ఇంకా పెరగాలని ఆకాంక్షించారు. ప్రపంచ మహిళాదినోత్సవం సందర్భంగా బుధవారం సర్వశిక్షాఅభియాన్, జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో రాజమహేంద్రవరంలోని వేంకటేశ్వర ఆనం కళాకేంద్రంలో ‘బాలికా తెలుసుకో’ కార్యక్రమం నిర్వహించారు. నగర మేయర్‌ పంతం రజనీశేషసాయికొండలరావు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్య అతిథి కలెక్టర్‌ మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో మహిళల పాత్ర పెరగాలని పేర్కొన్నారు. బాల్య వివాహాలను పూర్తిగా అరికట్టేందుకు మహిళలు కృషి చేయాలని కోరారు. 18 ఏళ్లు నిండిన తర్వాతే పెళ్లి ప్రస్తావన తీసుకువచ్చేలా అందరిలో చైతన్యం తీసుకురావాలని పిలుపునిచ్చారు. పౌష్టికాహార సమస్య వల్ల ఏజెన్సీలో గర్భిణులు, పురిటి బిడ్డలు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్య్డక్తం చేశారు. ఈ సమస్యను నిర్మూలించడానికి బుధవారం నుంచి ఏజెన్సీలోని గర్భిణులకు అన్నదీవెన పేరుతో పౌష్టికాహార కిట్లు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మేయర్‌ పంతం రజనీశేషసాయికొండలరావు మాట్లాడుతూ రాజకీయాల్లో ఇందిరా గాంధీని ఆదర్శంగా తీసుకోని రాణించాలని పిలుపునిచ్చారు. ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ మహిళలు విద్యకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఉన్న 5500 అంగ¯ŒSవాడీ కేంద్రాల్లో ప్రస్తుతం 50 కేంద్రాలను మహిళా శిశుసంజీవని ద్వారా అభివృద్ధి చేశామని జిల్లా శిశుసంజీవిని కోఆరి్డనేటర్‌ హెచ్‌ శ్రీదేవీ పేర్కొన్నారు. అనంతరం వివిధ రంగాల్లో ప్రతిభ చూపిన పలువురు మహిళలకు గుర్తింపు పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు జేసీ రాధాకృష్ణమూర్తి, సర్వశిక్షా అభియా¯ŒS పీవో ఎం. శేషగిరి, ఐసీడీఎస్‌ పీడీ శారదాదేవీ, డీఆర్‌డీఏ పథక సంచాలకులు ఎస్‌.మలి్లబాబు, డీఎం అండ్‌ హెచ్‌వో యం.చంద్రయోయ, జెడ్పీటీసీ సభ్యులు కె.రత్నం తదితరులు పాల్గొన్నారు. 
 
ర¯ŒS.. రాణి.. ర¯ŒS
తాడితోట,(రాజమహేంద్రవరం సిటీ) : ప్రపంచ మహిళా దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. రాజమహేంద్రవరం పోలీస్‌ అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజకుమారి పర్యవేక్షణలో షీ టీమ్‌ ఆధ్వర్యంలో 2కే ర¯ŒS నిర్వహించారు.  రాజమహేంద్రవరం ఆర్ట్స్‌ కాలేజీలో అర్బ¯ŒS జిల్లా ఎస్పీ బి.రాజ కుమారి జెండా ఊపి ఈ ర¯ŒSను ప్రారంభించారు. వై జంక్ష¯ŒS, కంబాల చెరువు, గోకవరం బస్టాండ్‌ మీదుగా పుష్కర ఘాట్‌కు చేరుకుంది. ఎస్పీ రాజకుమారి లక్ష్యసాధన కోసం విద్యార్థినులు కృషి చేయాలన్నారు. ప్రతి పురుషుడి వెనుక మహిళ ఉంటుందని, అలాగే మహిళ విజయం వెనుక కూడా పురుషుడు ఉంటాడని ఆమె పేర్కొన్నారు. ఆర్టీఓ సిరి ఆనంద్‌ మాట్లాడుతూ కృషి, పట్టుదల ఉంటే ఏ రంగంలోనైనా రాణించవచ్చని పేర్కొన్నారు. 2కే ర¯ŒSలో ప్రథమ స్థానాన్ని ఉమె¯Œ్స కాలేజీ విద్యార్థిని కె.దేవి, ద్వితీయ స్థానాన్ని ఎస్‌.గమనిక, తృతీయస్థానాన్ని ఎ.స్వాతి ప్రియ గెలుచుకున్నారు. వారికి ఎస్పీ రాజకుమారి మెమెంటోలు, బహుమతులు అందజేశారు. పుష్కర ఘాట్‌ వద్ద బీఎస్‌ఏటీ టీమ్‌ చేసిన ఫ్లాష్‌మాబ్, వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అడ్మి¯ŒS ఎస్పీ రజనీకాంత్‌ రెడ్డి, డీఎస్పీలు కుల శేఖర్, నారాయణ రావు, భరత్‌ మాతాజీ, శ్రీనివాసరావు, రామకృష్ణ, సీఐలు శ్రీరామ కోటేశ్వరావు, రవీంద్ర, సుబ్రహ్మణ్యేశ్వరరావు, కనకారావు, సురేష్, ఆర్‌ఎంఓ పద్మశ్రీ, మాటూరి మంగతాయారు, మంగాదేవి, యాంకర్‌ చోటు, షీటీమ్‌ సభ్యులు  పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు