వంద శాతం అక్షరాస్యతకు కృషిచేద్దాం

3 Jan, 2017 23:10 IST|Sakshi
వంద శాతం అక్షరాస్యతకు కృషిచేద్దాం

► దేవాదాయ, గృహ నిర్మాణ, న్యాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి
► బాసరలో తెలంగాణ రికౖగ్నైజ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ రాష్ట్రస్థాయి  సమావేశానికి హాజరు


బాసర : తెలంగాణ రాష్ట్రంతోపాటు నిర్మల్‌ జిల్లాలోవందశాతం అక్షరాస్యతకు కృషిచేద్దామని గృహా, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి ఐకేరెడ్డి అన్నారు. సోమవారం బాసరలో తెలంగాణ రికౖగ్నైజ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ రాష్ట్రస్థాయి సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. గ్రామీణస్థాయిలో నిరాక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు సాక్షరభారత్‌ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేరళ రాష్ట్రం తరహాలో రాష్ట్రంలో విద్యఅభివృద్ధికి కృషిచేస్తామన్నారు. అమ్మవారి సన్ని«ధిలో అక్షరశ్రీకార పూజలు చేసుకున్న దివంగంత మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు 14 భాషాల్లో ప్రావీణ్యం సంపాదించారని తెలిపారు.

అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రికగ్నైజ్డ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్  సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసరలో రాష్ట్ర స్థాయిసమావేశాలను నిర్వహించడం తమ అదృష్టమన్నారు. ఆలయ పరిసరాల ప్రాంతాల్లో ఆతిథి గృహాం, 20 గదుల నిర్మాణానికి స్థలం కేటాయించాలని మంత్రిని కోరారు. స్పందించిన మంత్రి.. ట్రస్మాకు గదుల నిర్మాణ స్థలాన్ని కేటాయించాలని ఆలయ ఈవో వెంకటేశ్వర్లుకు ఆదేశించారు. అంతకుముందు మంత్రి ఐకేరెడ్డి స్థానిక పోలీస్‌స్టేన్ లో గౌరవవంన్ ఉబేదుల్లాఖాన్, నాయకులు నూకంరామారావు, బీజేపీ అధ్యక్షుడు సతీశ్వర్‌రావు ఉన్నారు.

బాసర అమ్మవారి సన్నిధిలో మంత్రి పూజలు
మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి కుటుంబసమేతంగా సోమవారం బా సర అమ్మవారి సన్నిధిలో ప్రత్యేకపూజలు నిర్వహించారు. అ నంతరం అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నా రు. అంతకుముందు ఆలయాధికారులు మంత్రి ఐకేరెడ్డి దంపతులకు ఆలయమర్యాదలతో పూర్ణకుంభంతో స్వాగతం పలి కారు.  ఆలయ పూజారి సంజీవ్‌కుమార్‌ ఆధ్వర్యంలో పూజలు జరిగాయి. అనంతరం ఆలయాధికారులు మంత్రినిశాలువా తో సన్మానించి, అమ్మవారి చిత్రపటం, ప్రసాదం అందజేశా రు. ఎమ్మెల్యే విఠల్‌రెడ్డి, ఆలయ ఈవో వెంకటేశ్వర్లు, టీఆర్‌ఎస్‌ నాయకులు నూకంరామారావు, మల్కన్న యాదవ్, మా ర్కెట్‌ కమి టీ ఉపాధ్యక్షుడు ఆఫ్రోజ్‌ఖాన్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు