జిల్లాకు అదనపు ‘ఉపాధి’

7 Nov, 2016 23:50 IST|Sakshi

∙50 పని దినాలు పెంచుతూ ఆదేశాలు
∙ఇప్పటికే వలసబాట పట్టిన గ్రామీణులు
∙సాఫ్ట్‌వేర్‌ వస్తేనే పనుల కల్పన  
అనంతపురం టౌన్ :
కరువు జిల్లాలో వలసల నివారణకు   ప్రభుత్వం ఉపాధి హామీ పథకం కింద ప్రస్తుతం కల్పిస్తున్న పనులతో పా టు మరో 50 దినాలను అదనంగా కల్పిస్తోంది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి శాఖకు ఆదేశాలు జారీ చేసింది. అయితే అదనపు పనులకు సంబంధించి నూతన సాఫ్ట్‌వేర్‌ ఇంకా అందాల్సి ఉంది.

 వలస బాటలో గ్రామీణులు : జిల్లాలో ఈ  ఏడాది కనీవినీ రీతిలో కరువు కారణంగా గ్రామీణులు వలసబాట పట్టారు. వర్షాభావం కారణంగా ఖరీఫ్‌లో 6 లక్షల హె క్టార్లకు పైగా వేరుశనగ దెబ్బతింది. రబీలోనూ  1.50 లక్షల హెక్టార్లలో సాగులోకి రావాల్సిన పంటలు కూడా పత్తాలేకుండాపోయాయి. ఫలితంగా వ్యవసాయ కూలీలు పనులులేక వలసబాట పడుతు న్నారు.కొందరు బెంగళూరు, చెన్నై ప్రాం తాలకు వలసవెళ్లిపోవడంతో కొన్ని గ్రా మాల్లో వెలవెలబోతున్నాయి. రాయదు ర్గ, కళ్యాణదుర్గం, కదిరి, మడకశిర, పెనుకొండ నియోజకవర్గాల్లో పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఇప్పటికే వంద రోజుల పనిదినాలు పూర్తి చేసుకున్న జాబ్‌కార్డు దారులు గ్రామాల్లోఖాళీగా ఉంటున్నారు.
 63 మండలాల్లో అదనపు పనులు  
వర్షపాతాన్ని పరిగణనలోకి తీసుకున్న ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 241 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది. మన జిల్లా వరకు 63 మండలాలనూ కరువు మండలాలుగా పది రోజుల కిందట  ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అన్ని ప్రాంతాల్లోనూ అదనపు పనులు కల్పించనున్నారు.  ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి నవంబర్‌ 5వ తేదీ వరకు 2,48, 428 కుటుంబాలకు గాను 4,31,677 మందికి ఉపాధి పనులు కల్పించారు. 22,802 కుటుంబాలు వంద రోజుల పని దినాలు పూర్తి చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ఆదేశాలతో ఈ కుటుంబాలకు కూడా పనిదినాలు కల్పిస్తారు.  
సాఫ్ట్‌వేర్‌ వస్తేనే పనులు  
ఈ ఏడాది ఇప్పటికే కోటి 26 లక్షలకు పై గా పనిదినాలు క ల్పించాం. కరువు మండలాలుగా ప్రకటించడంతో 50 పని దినాలను అదనంగా ఇవ్వాలని సర్క్యులర్‌ వచ్చింది. సాఫ్ట్‌వేర్‌ రాగానే  పనులు కల్పిస్తాం. ప నులు కావాల్సిన వారు అధికారులను సంప్రదించొచ్చు.   
   – నాగభూషణం, డ్వామా పీడీ 

మరిన్ని వార్తలు