జిల్లా అభివృద్ధికి కృషి

11 Sep, 2017 22:54 IST|Sakshi
జిల్లా అభివృద్ధికి కృషి
  • జెడ్పీ ఇన్‌చార్జ్‌ చైర్‌పర్సన్‌ సుభాషిణమ్మ
  •  

    అనంతపురం సిటీ: జిల్లా అభివృద్ధికి తనవంతుగా కృషి చేస్తానని జెడ్పీ చైర్‌పర్సన్‌గా తాత్కాలిక బాధ్యతలు స్వీకరించిన సుభాషిణమ్మ తెలిపారు. సోమవారం జిల్లా పరిషత్‌ సమావేశ మందిరంలో ఆమె ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడుతూ,  జెడ్పీ పాలకవర్గం చాలా బాగా పని చేసిందని, భవిష్యత్‌లో కూడా ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్షించారు.

    జిల్లా సమగ్రాభివృద్ధికి పాటుపడాలని కోరారు. చమన్‌ పదవీ కాలం ముగియడంతో ఈ స్థానంలో తాత్కాలికంగా వైస్‌ చైర్‌పర్సన్‌ సుభాషిణమ్మను నియమించినట్లు తెలిపారు. అనంతరం బాధ్యతలు స్వీకరించిన సుభాషిణమ్మను అధికారులు, పలువురు టీడీపీ నేతలు, ప్రజాప్రతినిధులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ,  అనుకోకుండా తనకు వచ్చిన ఈ అవకాశాన్ని ప్రజాసేవకే వినియోగిస్తానన్నారు. బాధ్యతలు అప్పగించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్, శమంతకమణి, జెడ్పీ తాజా మాజీ చైర్మన్‌ చమన్, మాజీ ఎమ్మెల్యే అబ్దుల్‌ ఘని, పలువురు జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీటీసీ సభ్యులు, నగర మేయర్‌ స్వరూపతో పాటు సీఈఓ శోభాస్వరూప రాణి, డిప్యూటీ సీఈఓ సూర్యనారయణలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు