వడ్డెర సంక్షేమానికి కృషి

13 Oct, 2016 22:05 IST|Sakshi
వడ్డెర సంక్షేమానికి కృషి

కడప రూరల్‌:
ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్‌ ద్వారా ఏర్పాటైన సంఘాలకు రూ. 37 కోట్ల రుణాలు ప్రభుత్వం మంజూరు చేయనున్నట్లు ఆ ఫెడరేషన్‌ రాష్ట్ర చైర్మన్‌ దేవళ్ల మురళి అన్నారు. స్థానిక వైఎస్సార్‌ మెమోరియల్‌ ప్రెస్‌క్లబ్‌లో గురువారం సాయంత్రం నిర్వహించిన జిల్లా  వడ్డెర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. వడ్డెర్ల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. జిల్లాకు ఈ ఏడాది వడ్డెర ఫెడరేషన్‌కు మూడు యూనిట్లు మంజూరయ్యాయని,  50 యూనిట్ల మంజూరుకు చర్యలు చేపడతామన్నారు. కొండ క్వారీల్లో   యంత్రాలను వినియోగిస్తున్నారని, ఆ యంత్రాలను వడ్డెర్లకు కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జిల్లాలో వడ్డెర భవన్‌ ఏర్పాటుకు త్వరలో చర్యలు చేపడతామని వెల్లడించారు.
వడ్డెర్ల సమస్యలను పరిష్కరించాలి
ఈ సందర్భంగా వడ్డెర నాయకులు బత్తుల జానకిరాం, గురుప్రసాద్, నంద్యాల సుబ్బరాయుడు, గంపా తిరుపతి మాట్లాడుతూ వడ్డెర్లను ఎస్టీ జాబితాలో చేర్చాలన్నారు. అలాగే జనాభా ప్రాతిపదికన వడ్డెర ఫెడరేషన్‌కు రూ. వెయ్యి కోట్లు కేటాయించాలన్నారు.   బత్తల లక్ష్మయ్య, రమణ, బెల్లంకొండ శ్రీనివాస్, శేఖర్, పెద్ద సంఖ్యలో వడ్డెర నాయకులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు