సెప్టెంబర్‌ చివరిలోగా కూల్చివేతలు పూర్తి చేయాలి

30 Aug, 2016 23:44 IST|Sakshi
సెప్టెంబర్‌ చివరిలోగా కూల్చివేతలు పూర్తి చేయాలి
యాదగిరిగుట్ట: యాదాద్రి అభివృద్ధిలో భాగంగా కొండపై కొనసాగుతున్న కూల్చివేతల పనులను సెప్టెంబర్‌ చివరిలోగా పూర్తి చేయాలని వైటీడీఏ వైస్‌ చైర్మన్‌ కిషన్‌రావు, ఇంజినీరింగ్‌ చీఫ్‌ రవీందర్‌రావులు సన్‌షైన్‌ ప్రతినిధులను ఆదేశించారు. మంగళవారం  వారు ప్రధానాలయంలో రాజగోపురాలు కూల్చివేత, రిటెయినిగ్‌ వాల్, పెద్దగుట్టపై అభివృద్ధి పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా యాదాద్రి పనులపై పలు సూచనలు చేశారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ యాదాద్రి అభివృద్ధి పనుల కోసం జరుగుతున్న బ్లాస్టింగ్‌ల వల్ల స్థానికులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
 
కంట్రోలర్, ఆర్డినరి రెండు రకాలుగా జరుగుతున్న బ్లాసింగ్‌లను ఇంజనీర్ల పర్యవేక్షణలో జరగాలని సూచించారు. రాజగోపురాల పనుల్లో వేగం పెంచాలన్నారు. 2017 దసరా నాటికి ప్రధానాలయం పూర్తి చేసి భక్తులకు గర్భాలయ దర్శనం కల్పిస్తామన్నారు. యాదాద్రి అభివృద్ధి పనులపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. యాదాద్రి పరిశీలనకు త్వరలోనే సీఎం కేసీఆర్‌ వస్తారని తెలిపారు. అంతకు ముందు ఆలయ అభివృద్ధికి సంబంధించిన మ్యాప్‌లను పరిశీలించారు. వారి వెంట స్థపతులు సుందర్‌రాజన్, వేలు, ఆర్కిటెక్ట్‌లు ఆనంద్‌సాయి, బడే రవి, బాబురావు, అధికారులు దోర్భల భాస్కర్‌శర్మ, చంద్రశేఖర్, సురేందర్‌రెడ్డి, ఆర్‌అంyŠ  బీ అధికారులు ఉన్నారు.
మరిన్ని వార్తలు