రేపు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం

7 Aug, 2016 21:03 IST|Sakshi
గుంటూరు వెస్ట్‌ : రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ నెల 9వ తేదీన ప్రపంచ ఆదివాసీ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి నారాయణుడు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. నగరంలోని రెవెన్యూ కల్యాణ మండపంలో నిర్వహించే వేడుకలకు జిల్లా కలెక్టర్‌ కాంతిలాల్‌ దండే, గుంటూరు పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాలరెడ్డి హాజరవుతున్నారని పేర్కొన్నారు. జిల్లాలోని వివిధ గిరిజన సంఘాల నాయకులు, విద్యార్థి, యువజన సంఘాల నాయకులు పాల్గొని వేడుకలను జయప్రదం చేయాలని కోరారు.
మరిన్ని వార్తలు