పల్లె ప్రగతితో దేశాభివృద్ధి

2 Aug, 2016 21:11 IST|Sakshi
ఖానాపూర్‌లో మాట్లాడుతున్న ప్రతినిధులు
  • ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్‌, బాలకృష్ణ
  • కోహీర్‌: పల్లెలు ప్రగతికి పట్టుగొమ్మలని, పల్లెలు ప్రగతి సాధిస్తేనే దేశం అభివృద్ధి చెందుతుందని ప్రపంచ బ్యాంకు ప్రతినిధులు వినయ్‌, బాలకృష్ణ అన్నారు. సెర్ప్‌ అధికారులతో కలిసి వారు మండలంలోని బడంపేట, ఖానాపూర్‌, కోహీర్‌లో మంగళవారం పర్యటించి ఉత్పత్తిదారులు, సంఘాల ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు.

    గ్రామీణ ప్రాంత ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టిందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 150 మండలాల్లో, జిల్లాలోని 17 మండలాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ప్రపంచ బ్యాంకుతో కలిసి రూ. 650 కోట్లతో కార్యక్రమాలు చేపట్టిందన్నారు. అందులో రూ. 450 కోట్లు ప్రపంచ బ్యాంకు నిధులు, రూ. 150 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం వాటా ఉందన్నారు.

    పల్లె సమగ్ర సేవా కేంద్రాల ద్వారా  ప్రజలకు నాణ్యమైన సేవలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో సెర్ప్‌ అధికారులు వంశీ, సత్యదేవ్‌, డీపీఎంలు వాసుదేవ్‌, రాజు, ఏసీ యాదయ్య, ఎంపీపీ జంపాల అనిత, సర్పంచులు పుష్ప, శంకర్‌, ఈఓపీఆర్‌డీ శ్రీనివాస్‌రెడ్డి, ఏపీఎంలు సమ్మయ్య, సమత, పంచాయతీ కార్యదర్శులు అశోక్‌రెడ్డి, విజయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు