ప్రజాస్వామ్యంలో పత్రికారంగం ఎంతో కీలకం

17 Nov, 2016 23:17 IST|Sakshi
ప్రజాస్వామ్యంలో పత్రికారంగం ఎంతో కీలకం

లేపాక్షి : ‘ప్రజాస్వామ్యంలో పత్రికలు, టీవీ ప్రసారాలు లేకుంటే అవినీతి, అక్రమాలు, దోపిడీలు పెచ్చుమీరేవి. పత్రికలు ఉండటంతోనే అవినీతి నిర్మూలనలో పత్రికా రంగం ఎంతో కీలకం’ అని తహశీల్దార్‌ ఆనందకుమార్‌ అన్నారు. గురువారం ఉదయం లేపాక్షిలో మండల జర్నలిస్టుల అసోషియేషన్‌ ఆధ్వర్యంలో ప్రపంచ జర్నలిస్టుల దినోత్సవం నిర్వహించారు. వేడుకలకు హాజరైన ఆయన మాట్లాడుతూ పాత్రికేయులు ప్రజాస్వామ్యానికి ప్రజలకు వారధిలా ఉంటారన్నారు. ప్రజాస్వామ్యంలో శాసన, కార్యనిర్వాహక, న్యాయ శాఖలు మూడు స్తంభాలుగా ఉంటే కనిపించని నాలుగో స్తంభమే మీడియా వ్యవస్థ అని వివరించారు.

కార్యక్రమంలో ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ, ఎంఈఓ నాగరాజు, ఎంపీపీ హనోక్‌ మాట్లాడారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి సీనియర్‌ పాత్రికేయులను అధికారులు, ప్రజాప్రతినిధులు సన్మానించారు. ఎస్‌ఐ శ్రీధర్, హిందూపురం నియోజకవర్గ ఏపీయూడబ్ల్యూజే అధ్యక్షుడు రమేష్, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు, కార్యదర్శి గోవర్దన్‌బాబు, స్థానిక అధ్యక్షుడు నాగభూషణ, నాయకులు అశోక్, నాగభూషణ, సందీప్, అల్లీపీరా, ప్రదీప్, శశాంక్‌ ఆయా పార్టీల కన్వీనర్లు నారాయణస్వామి, ప్రభాకర్‌రెడ్డి, శివప్ప, నరసింహప్ప, ఎంపీటీసీ సభ్యులు చిన్న ఓబన్న, చలపతి, నాగభూషణ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు