‘గ్రేటర్‌’కు చెడ్డ పేరు తేవద్దు

17 Mar, 2017 05:07 IST|Sakshi
‘గ్రేటర్‌’కు చెడ్డ పేరు తేవద్దు

అధికారులపై మేయర్‌ నరేందర్‌ ఆగ్రహం
విధులను నిర్లక్ష్యం చేస్తే చర్య తీసుకోవాలని ఆదేశం  
అధికారులతో సమీక్ష   


వరంగల్‌ అర్బన్‌ : కొంతమంది అధికారులు, ఉద్యోగులు బాధ్యతల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, గ్రేటర్‌కు చెడ్డపేరు తేవద్దని గ్రేటర్‌ మేయర్‌ నన్నపునేని నరేందర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం సాయంత్రం మహానగర పాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో వింగ్‌ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రధాన కార్యాలయం, సర్కిల్‌ కార్యాలయాల్లోని ఉద్యోగులు సమయపాలన పాటించడం లేదని అన్నారు. అధికారులు, ఉద్యోగుల విధులపై నిఘా ఉంచాలని అడిషనల్‌ కమిషనర్‌ షాహిద్‌ మసుద్‌కు సూచించారు. నిర్లక్ష్యపు అధికారులపై చర్య తీసుకోవాలని హెచ్చరించారు. ప్రజారోగ్య విభాగానికి 25 సంవత్సరాలుగా ఒకే కాంట్రాక్టర్‌ రసాయనాలను సరఫరా చేయడం సరికాదని, కాంట్రాక్టర్‌ను మార్చలని ఎంహెచ్‌వో రాజారెడ్డిని ఆదేశించారు. స్వచ్ఛత ఆటోలు రాబోతున్నాయని, డస్ట్‌బిన్‌లు కొనుగోలు చేయాలని ఈఈ లింగామూర్తిని ఆదేశించారు. మహానగరంలో వెలుస్తున్న అక్రమ నిర్మాణాలపై టౌన్‌ ప్లానింగ్‌ అధికారులు, చూసీచూడనట్లుగా వ్యవహరించడం సరికాదన్నారు. క్షేత్ర స్థాయిలో తనీఖీలు నిర్వహించి అక్రమార్కులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.

ఆన్‌లైన్‌ అనుమతులు, గ్రీవెన్స్‌ సెల్‌ ఫిర్యాదులను త్వరగా పరిష్కరించాలన్నారు. సమావేశంలో అడిషనల్‌ కమిషనర్‌ షాహిద్‌ మసుద్, డిప్యూటీ కమిషనర్‌ ఇంద్రసేనా రెడ్డి, సెక్రటరీ నాగరాజ రావు, ఇన్‌చార్జి ఎస్‌ఈ భిక్షపతి, ఇన్‌చార్జి  సీపీ చంద్రిక, ఈఈ లింగామూర్తి, ఎంహెచ్‌వో రాజారెడ్డి, ఏసీపీ శైలజ,గణపతి, శ్యాంకుమార్, రవి,ఇన్‌చార్జ్‌ ఉద్యాన వన అధికారి సదానందం పాల్గొన్నారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు