రెజ్లింగ్‌ చాంపియన్స్‌.. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం

3 Oct, 2016 01:23 IST|Sakshi
రెజ్లింగ్‌ చాంపియన్స్‌.. శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం
 
నాయుడుపేటటౌన్: రాష్ట్ర స్థాయి 3వ సీనియర్‌ పురుషులు, మహిళల రెజ్లింగ్‌ చాంపియన్‌ షిప్‌ ట్రోఫీ  శ్రీకాకులం, నెల్లూరు జట్లు కైవసం చేసుకున్నాయి. మహిళల విభాగంలో విశాఖపట్నం జట్టు నిలిచింది. స్థానిక జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో మూడు రోజులుగా రాష్ట్ర స్థాయి రెజ్లింగ్‌ పోటీలు ఆశక్తికరంగా జరిగాయి. నెల్లూరు రెజ్లింగ్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో పోటీలు నిర్వహించారు. చివరి రోజు జరిగిన ఫైనల్స్‌లో ముఖ్య అతిథులుగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పట్టణ అధ్యక్షుడు 786 రఫీ, నాయకులు కట్టా వెంకటరమణారెడ్డిలు పాల్గొని విజేతలకు పథకాలను బహుకరించారు.రాష్ట్ర రెజ్లింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యదర్శి రాజ్‌కుమార్‌ మాట్లాడుతూ విభజన తర్వాత రాష్ట్ర స్థాయిలో 3వ రెజ్లింగ్‌ పోటీలను నాయుడుపేటలో నిర్వహించినట్లు తెలిపారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కౌన్సిలర్‌ కేఎంవీ కళాచంద్, రాష్ట్ర రెజ్లింగ్‌ అబజర్వర్‌ కే నర్సింగ్‌ రావు, సంయుక్త కార్యదర్శి భూషణం, ఉపాధ్యక్షుడు రామయ్య, జిల్లా అధ్యక్షుడు కే వెంకటకృష్ణయ్య, కార్యదర్శి మంగళపూరి శివయ్య, ట్రెజరర్‌ ఎం ఉదయ్‌ కుమార్, 13 జిల్లాలకు చెందిన కోచ్‌లు, సీనియర్‌ క్రీడాకారులు పాల్గొన్నారు. అనంతరం కార్యక్రమానికి వచ్చిన ముఖ్యఅతిధులతో పాటు సీనియర్‌ క్రీడాకారులకు, జాతీయ, రాష్ట్ర స్థాయిలో ప్రతిభ చూపి ఉన్న క్రీడాకారులకు ఈ సందర్భంగా జిల్లా రెజ్లింగ్‌ అసోసియేషన్‌ నాయకులు శాలువలు కప్పి పూలమాలలతో సత్కరించారు.  
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు