యాగాల వల్లే దేశం సుభిక్షం

2 Sep, 2016 02:09 IST|Sakshi
యాగాల వల్లే దేశం సుభిక్షం
అన్నవరప్పాడు (పెరవలి) : వేద పండితులు నిర్వహిస్తున్న యాగాలు, అర్చకులు చేస్తున్న పూజల వల్లనే దేశం సుభిక్షంగా ఉందని దేవాదాయ ధర్మాదాయ శాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ సీహెచ్‌ దుర్గాప్రసాద్‌ పేర్కొన్నారు. మండలంలోని అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో వేద పండితుడు ఖండవల్లి సూర్యనారాయణ చార్యులు రచించిన ‘సంక్షిప్త ప్రతిష్ఠా సరళి గ్రం«థం’ను గురువారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలో 1721 దేవాలయాలకు గాను 710 దేవాదాయ శాఖా అధీనంలో ఉన్నాయని అన్నారు. వీట న్నింటికీ కమిటీలు వేస్తున్నామని, ఇప్పటికీ 80 శాతం పూర్తి చేశామని చెప్పారు. జిల్లాలో ప్రముఖ దేవాలయాలైన భీమవరం మావుళ్లమ్మ అమ్మవారు, ద్వారకా తిరుమల శ్రీవారి ఆలయాలను కలుపుతూ టూరిజం ఏర్పాటు చేస్తున్నామని, ఇది త్వరలోనే భక్తులకు అందుబాటులోకి వస్తుందని చెప్పారు. గత నెలలో దేవాలయాలన్నింటిలో నిర్వహించిన వరుణ, అరుణయాగం, సహస్ర ఘటాభిషేకం వల్లనే మూడు రోజులుగా రాష్ట్రంలో వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయని తెలిపారు. శాస్త్రాలు, పురాణాలు ఆధారంగా క్రతువుల్లో చేసే యాగాల ఫలమే ప్రపంచశాంతికి, దేశ సుఖశాంతులకు దోహదం చేస్తున్నాయని అన్నారు. తొలుత ఆయనకు పండితులు వేద మంత్రాల నడుమ పూర్ణకుంభంతో స్వాగతం పలకగా వేదపండితులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో ఆ శాఖ ఇ¯Œæస్పెక్టర్‌ శ్రీనివాస్, ఈవో వీఎస్‌ఎస్‌ బ్రహ్మారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. 
 
మరిన్ని వార్తలు