6 నుంచి యానాం ప్రజా ఉత్సవాలు

3 Jan, 2017 23:08 IST|Sakshi
  • ఫల పుష్ప ప్రదర్శనకూ ఏర్పాట్లు
  • ముస్తాబవుతున్న బాలయోగి క్రీడామైదానం
  • హాజరుకానున్న పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్, సీఎం
  •  
    యానాం టౌ¯ŒS :
    పుదుచ్చేరి పర్యాటకశాఖ ఆధ్వర్యంలో ఈ నెల 6 నుంచి 8 వరకు 15వ యానాం ప్రజా ఉత్సవాలను, వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో 18వ ఫల, పుష్ప ప్రదర్శనను స్థానిక జీఎంసీ బాలయోగి క్రీడామైదానంలో నిర్వహించనున్నారు. పుదుచ్చేరి పర్యాటకశాఖ మంత్రి మల్లాడి కృష్ణారావు, ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. క్రీడామైదానంలో భారీ స్వాగత ద్వారాలు, ఫల, పుష్ప ప్రదర్శన ఏర్పాటుకు ప్రత్యేక వేదికను తీర్చిదిద్దుతున్నారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రి ముఖ్యఅతిథిగా హాజరై ఉత్సవాలను ప్రారంభిస్తారు. 8న జరిగే ముగింపు వేడుకల్లో పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ డాక్టర్‌ కిరణ్‌బేడీ పాల్గొననున్నారు. ఉత్సవాల్లో తొలిరోజున ప్రముఖ సినీనటుడు మోహ¯ŒSబాబుతో పాటు పలువురు ప్రముఖులను సత్కరించనున్నారు. 
    పలు సాంస్కృతిక కార్యక్రమాలు
    ప్రజా ఉత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు పలు సాంస్కృతిక, నృత్యప్రదర్శనలు నిర్వహించనున్నారు.
     
    ఫల, పుష్ప ప్రదర్శనలో 20 వేల మొక్కలు
    వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే ఫల, పుష్ప ప్రదర్శనలో సుమారు 20 వేల పుష్పజాతుల మొక్కలు కనువిందు చేయనున్నాయి. వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో విత్తనాలు రప్పించి నర్సరీలో నాలుగు నెలలుగా 20 రకాల మొక్కలను పెంచి సిద్ధం చేశారు. వీటితో పాటు బెంగళూరు, పూణేల నుంచి తీసుకొచ్చిన వివిధ రకాల గులాబీ తదితర పూలమొక్కలను వివిధ రకాల కూరగాయలు, ఆయా రకాల పండ్ల స్టాళ్లను ప్రదర్శనలో ఉంచనున్నారు.
     
మరిన్ని వార్తలు