యోగాతో మానసిక పరివర్తన

2 Sep, 2016 19:54 IST|Sakshi
యోగాతో మానసిక పరివర్తన

 జిల్లా జైలులో ముగిసిన శిక్షణ శిబిరం
సంగారెడ్డి టౌన్:
యోగాతో మానసిక పరివర్తన వస్తుందని పతాంజలి ఆయుర్వేద లిమిటెడ్‌ సంస్థకు చెందిన యోగా శిక్షకులు మోహన్‌రెడ్డి అన్నారు. స్థానిక కందిలోని జిల్లా జైలులో గత నెల 18 నుంచి ఖైదీలకు శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. శుక్రవారం ముగింపు సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదిహేను రోజులుగా ఖైదీలకు, జైలు సిబ్బందికి ఆసనాలు, ప్రాణాయామంలో శిక్షణ ఇచ్చామన్నారు.

  నిత్యం యోగా చేస్తే మానసిక రుగ్మతలు, వ్యాధులకు దూరంగా ఉండొచ్చన్నారు. శారీరకంగా, మానసికంగా ఎంతో ప్రశాంతత నెలకొందని ఖైదీలు తెలిపారు.  కార్యక్రమంలో జైలు పర్యవేక్షకులు సంతోష్‌ కుమార్‌రామ్, జైలర్‌ చిరంజీవి, డిప్యూటీ జైలర్లు ప్రభాకర్, చంద్రశేఖర్, సిబ్బంది, ఖైదీలు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు