చదువుతో పేదరికాన్ని జయించాలి

21 Apr, 2017 04:19 IST|Sakshi
చదువుతో పేదరికాన్ని జయించాలి

పర్వతగిరి(వర్ధన్నపేట):
పేదరికాన్ని అనుభవిస్తూ కస్తూర్బా పాఠశాలలో చదువుతున్న విద్యార్థినిలు చదువుతో పేదరికాన్ని జయించాలని కడియం కావ్య అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బా పాఠశాల విద్యార్థినులకు తాగునీటి సౌకర్యం కోసం గురువారం కావ్య ఫ్రిజ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. కస్తూర్బా పాఠశాల విద్యార్థినీల సౌకర్యార్థం మరిన్ని సౌకర్యాలు కల్పించనున్నట్లు చెప్పారు.

విద్యార్థినులు ఆత్మస్థైర్యంతో ఉన్నత లక్ష్యాలను అధిరోహించాలన్నారు. వందేమాతరం షౌండేషన్‌ వ్యవస్థపకుడు రవీందర్‌రావు మాట్లాడుతూ పాఠశాలలో ఏర్పాటుచేసిన ఎంఎన్‌ఎస్‌ ప్రోగ్రాం ద్వారా విద్యార్థినులు కార్పొరేట్‌ స్థాయిని మించి గణితం చేయగలరని ధీమా వ్యక్తం చేశారు. డాక్టర్‌ నజీర్‌ మాట్లాడారు. అనంతరం విద్యార్థినులు కావ్యకు బహుమతులు అందజేశారు. వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థినులు చేసిన నృత్యాలు పలువురిని ఆకట్టుకున్నాయి. ప్రిన్సిపాల్‌ కక్కెర్ల శ్రీదేవి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు