ప్రేమ విఫలమై ఆత్మహత్యాయత్నం

17 Dec, 2016 21:20 IST|Sakshi
అప్రమత్తమై యువకుడిని కాపాడిన పోలీసులు 
 
ప్రకాశం బ్యారేజి (తాడేపల్లి రూరల్‌): తాడేపల్లి పట్టణ పరిధిలోని సీతానగరం ప్రకాశం బ్యారేజి వద్ద ఓ యువకుడు శనివారం సాయంత్రం ఆత్మహత్యాయత్నం చేశాడు. సీసీ కెమెరాల ద్వారా గమనించిన పోలీసులు యువకుడి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. అతని వివరాలు సేకరించగా...యువకుడు  మంగళగిరికి చెందిన మాచర్ల రవితేజ అని, ప్రేమ విఫలం కావడంతో ఆత్మహత్యా ప్రయత్నం చేసినట్టు తెలిపాడు.  పోలీసులు యువకునికి కౌన్సెలింగ్‌ చేసి తల్లిదండ్రులను పిలిపించి  అప్పగించారు.
మరిన్ని వార్తలు