పని కోసం వెళ్తూ పరలోకాలకు..

22 Aug, 2016 19:14 IST|Sakshi
  • ఖమ్మం బస్సు ప్రమాదంలో కరీంనగర్‌ జిల్లా యువకుడి మృతి 
  •  జ్యోతినగర్‌ : కరీంనగర్‌ జిల్లా రామగుండం ఎన్టీపీసీ అన్నపూర్ణకాలనీకి చెందిన అనువాల అశోక్‌కుమార్‌(25) సోమవారం ఖమ్మం జిల్లాలో జరిగిన బస్సు ప్రమాదంలో అసువులుబాశాడు. అనువాల కాంతయ్య–పద్మ దంపతుల రెండవ కుమారుడైన అశోక్‌కుమార్‌ ఇటీవలనే బీటెక్‌ పూర్తి చేశాడు. తండ్రి వెల్డర్‌గా పనిచేస్తుండగా అతడి వద్ద వెల్డింగ్‌ పనిలో నైపుణ్యత పెంపొందించుకున్నాడు. కాకినాడలోని ఓ ప్రయివేటు కంపెనీలో పనిలో చేరేందుకు హైదరాబాద్‌ నుంచి కాకినాడకు ప్రయివేటు బస్సులో ప్రయాణిస్తున్న క్రమంలో జరిగిన ప్రమాదంలో మృతి చెందాడు. అశోక్‌కుమార్‌ వద్ద లభించిన ఆధార్‌కార్డు ఆధారంగా ఎన్టీపీసీ ఎస్సై సాగర్‌కు ఖమ్మం పోలీసులు సమాచారం అందించారు. అశోక్‌కుమార్‌ మృతదేహాన్ని తీసుకొచ్చేందుకు అతడి అన్న విజయ్‌కుమార్, బంధువులు ఖమ్మం బయలుదేరి వెళ్లారు.
     
మరిన్ని వార్తలు