పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య

24 Jun, 2017 21:50 IST|Sakshi
వెల్దుర్తి(కృష్ణగిరి): ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మంది తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. వెల్దుర్తి మండలం   పులగుమ్మి గ్రామంలో చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు ఇలా ఉన్నాయి.   గ్రామానికి చెందిన ఈశ్వర్‌రెడ్డికి ఇద‍​‍్దరు కుమార్తెలు, ఓ కుమారుడు సంతానం. కుమారుడు  శ్రీనివాసరెడ్డి(29) శుభకార్యాల్లో డెకరేషన్‌ పనులకు వెళ్తుంటాడు. శనివారం  గ్రామ శివారులోని పొలాల్లో పురుగుల మందుతాగాడు. అక్కడే ఆపస్మారక స్థితిలో పడి ఉండగా సమీప పొలాల్లోని వారు గుర్తించి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. వారు అక్కడికి చేరుకొని   వైద్యం కోసం ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మ​ృతిచెందాడు. ఉన్న ఒక్క కుమారుడు ఆత్మహత్య చేసుకోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కుటుంబ ఆర్థిక పరిస్థితులే ఇందుకు కారణమని తెలుస్తోంది. తండ్రి ఈశ్వర్‌రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.  
 
Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు