ఆస్తి కోసం అన్న హత్య

26 Dec, 2016 18:20 IST|Sakshi
వరంగల్: ఆస్తి తగాదాల నేపథ్యంలో ఓ వ్యక్తి సొంత అన్ననే కత్తితో పొడిచి దారుణంగా హతమార్చాడు. ఈ సంఘటన వరంగల్ రూరల్‌జిల్లా సంగెం మండలం షాపూర్ గ్రామంలో సోమవారం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన యండీ యాకూబ్(45)ను తమ్ముడు కత్తితో పొడిచి హత్య చేశాడు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్య చేసిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 
మరిన్ని వార్తలు