విద్యుదాఘాతంతో యువకుడి మృతి

12 Feb, 2017 21:35 IST|Sakshi

విడపనకల్లు (ఉరవకొండ) : విడపనకల్లు మండల పరిధిలోని వేల్పమడుగు గ్రామానికి చెందిన రైతు సుబ్బారెడ్డి కుమారుడు శివారెడ్డి (25) శనివారం రాత్రి పంటకు నీరు పెట్టేందుకు వెళ్లి విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు శివారెడ్డి పొలంలో నీళ్లు కట్టేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. బోరు ఆన్‌ చేయడానికి ప్రయత్నిస్తుండగా విద్యుత్‌ షాక్‌ గురై తీవ్రంగా గాయపడ్డాడు. పక్కనున్న పొలంలో రైతులు గుర్తించి శివారెడ్డిని బళ్లారి ఆస్పత్రికి తరలిస్తుండగా అతను మార్గంమధ్యలో మృతి చెందాడు.

మరిన్ని వార్తలు