జీవితంపై విరక్తితో యువకుడి ఆత్మహత్య

13 Mar, 2016 21:07 IST|Sakshi

చేవెళ్ల రూరల్ : జీవితంపై విరక్తి చెంది ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్య పాల్పడ్డాడు. ఈ సంఘటన మండల కేంద్రంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. షాబాద్ మండలం తిమ్మారెడ్డిగూడకు చెందిన గుత్తి మహేందర్ (29) బీఈడీ పూర్తి చేసి మండలంలోని చందనవెల్లి పాఠశాలలో విద్యావలంటీర్‌గా పనిచేస్తున్నాడు. శనివారం సాయంత్రం చేవెళ్లకు వచ్చిన మహేందర్ తిరిగి ఇంటికి రాలేదు. కాగా.. చేవెళ్ల సమీపంలో గల ఫరా కళాశాల సమీపంలో ఓ చెట్టు కింద పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఉదయం అటువైపు వెళ్లిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు.

మృతుడి వద్ద తను జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సూసైడ్‌నోట్ దొరికిందని చెప్పారు. రాత్రి నుంచి ఇంటికిరాలేదని కుమారుడి కోసం తండ్రి వెతుకుతున్నాడు. అతని వద్ద లభించిన ఆధారాలతో పోలీసులు కుటుంబసభ్యులకు సమాచారం మృతుడి తండ్రి ఆనందం ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహానికి చేవెళ్లలో పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు.

Read latest District News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు