రైలు ఢీకొని యువకుడి మృతి

21 Oct, 2016 01:47 IST|Sakshi
రైలు ఢీకొని యువకుడి మృతి
కావలి అర్బన్‌ : పట్టాల వైపు బహిర్భూమికి వెళ్లిన యువకుడిని రైలు ఢీకొనడంతో మృతి చెందిన సంఘటన గురువారం స్థానిక వైకుంఠపురం రైల్వే గేటు సమీపంలో జరిగింది. స్థానిక వైకుంఠపురానికి చెందిన వల్లూరు రమణారెడ్డి కుమారుడు బ్రహ్మారెడ్డి (25)పట్టణంలోని ఇండియన్‌ గ్యాస్‌ ఏజెన్సీలో డెలివరీ బోయ్‌గా పని చేస్తున్నాడు. ఉదయం బహిర్భూమికని రైలు పట్టాల వైపు వెళ్లి తిరిగి ఇంటికి ఫోనులో మాట్లాడుతూ వస్తున్న సమయంలో చెన్నై వైపు వెళ్లే రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని కీమ్యాన్‌ గుర్తించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలాన్ని పరిశీలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు.  మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. 
 
 
మరిన్ని వార్తలు