సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

3 Oct, 2016 00:05 IST|Sakshi
సేవా కార్యక్రమాల్లో యువత ముందుండాలి

 వెల్లంకి (రామన్నపేట) : యువత సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనాలని సర్పంచ్‌ నకిరేకంటి స్వప్న, ఎంపీటీసీ కూరెళ్ల నర్సింహాచారి కోరారు. ఆదివారం మండలంలోని వెల్లంకి గ్రామంలో శివాజీయూత్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని వారు ప్రారంభించి మాట్లాడారు. రక్తదానం వల్ల ఆపదలో ఉన్న మరొకరికి ప్రాణదానం చేసిన వారవుతారని తెలిపారు. శిబిరంలో 30 యూనిట్ల రక్తాన్ని సేకరించారు. కార్యక్రమంలో వైద్యులు సుబ్బారావు, నిర్మల, అనిత, వల్లందాసు కృష్ణ, వివిధ పార్టీల నాయకులు తాటిపాముల శివకృష్ణ, నకిరేకంటి అశోక్, నిర్వాహకులు కొయ్యలకొండ రాజు, దేశబోయిన శ్రీధర్, ఎర్రంబెల్లి రాజు, కందాల శివశంకర్‌ పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు