రాష్ట్రంలో డిక్టేటర్ పాలన: వైఎస్ జగన్

18 Dec, 2015 17:56 IST|Sakshi
రాష్ట్రంలో డిక్టేటర్ పాలన: వైఎస్ జగన్

హైదరాబాద్:ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికార పక్ష సభ్యులకు అసెంబ్లీ నిబంధనలు తెలియకుండా మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మండిపడ్డారు. ఇక్కడ ఉన్న వాళ్లకి స్టేట్ మెంట్ కి, చర్చకు తేడా తెలియకుండా పోతుందని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు. నిబంధనల ప్రకారం ముందు చర్చ జరిపిన తరువాతే స్టేట్ మెంట్ ఇస్తారన్న విషయం టీడీపీ సభ్యులు తెలుసుకుంటే మంచిదన్నారు. శుక్రవారం అసెంబ్లీ సమావేశాలు సందర్భంగా కాల్ మనీ- సెక్స్ రాకెట్ వ్యవహారంపై మాట్లాడిన వైఎస్ జగన్.. అధికార పార్టీ తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో డిక్టేటర్ పరిపాలన సాగుతుందన్నారు. కాల్ మనీ వ్యవహారంపై పద్దతి ప్రకారం చర్చకు అనుమతి ఇవ్వాలని వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు.


వైఎస్ జగన్ ఏమన్నారంటే...

* చర్చ జరిపిన తరువాత స్టేట్ మెంట్ ఇస్తారు.. స్టేట్ మెంట్ ఇచ్చిన తరువాత చర్చ జరపరు
* కాల్ మనీ వ్యవహారంపై పద్దతి ప్రకారం చర్చకు అనుమతి ఇవ్వండి
* చంద్రబాబు ఇచ్చింది స్టేట్ మెంట్ అయితే ఆ కాపీలు ప్రతిపక్ష సభ్యుల దగ్గర లేవే?
* స్పీచ్ వేరు.. స్టేట్ మెంట్ వేరు
* డిక్టేటర్ పరిపాలన సాగుతుందన్న విషయం అందరికీ తెలుసు
* మీ కళ్ల ముందే టీడీపీ సభ్యులు పరుషంగా మాట్లాడినా.. స్పీకర్ గారు చర్యలు తీసుకోరు
* మేం చెప్పేది రెండు నిమిషాలు వినే ఓపిక కూడా లేకపోవడం బాధాకరం
*నిబంధనల ప్రకారం స్టేట్ మెంట్ ఇచ్చాక డిస్కషన్ ఉండదు
*అందుకే ముందు చర్చ జరపాలని కోరుతున్నాం
* మన దురదృష్టం కొద్ది డిస్కషన్, స్టేట్ మెంట్, క్లారిఫికేషన్ అంటే ఇక్కడి వారి తెలియదు
*అధికార సభ్యులు మాట్లాడే మాటలు ప్రజాస్వామ్య బద్ధమైనవా?
*మమ్మల్ని ఉద్దేశించి అన్న మాటలు.. స్టేట్ మెంట్ కు సంబంధించినవా?
*చంద్రబాబుతో ఫోటో దిగిన డీఈని విధుల నుంచి తొలగిస్తామని చెప్తున్నారు
*అలాంటప్పుడు ఇంటెలిజెన్స్ ఏడీజీతో అదే నిందితుడు మంతనాలు చేశాడు
*మరి ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటారు?

మరిన్ని వార్తలు