'చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు'

21 Jan, 2016 13:51 IST|Sakshi
'చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు'

నెల్లూరు : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతల పట్ల చంద్రబాబు సర్కార్ దుర్మార్గంగా వ్యవహరిస్తోందని ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోపించారు. గురువారం నెల్లూరు నగరంలోని జైలులో ఉన్న ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి, శ్రీకాళహస్తి ఇంచార్జ్ బి.మధుసూధన్ రెడ్డిని ఆయన పరామర్శించారు. అనంతరం జైలు బయట వైఎస్ జగన్మోహన్రెడ్డి విలేకర్లతో మాట్లాడుతూ... ముఖ్యమంత్రి చంద్రబాబు ఆయన తనయుడు లోకేశ్ అవినీతిని అడ్డుకున్నందుకే మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారని విమర్శించారు.

కేసుల పేరుతో తమ పార్టీ నేతలను టార్గెట్ చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ నేతల్లో రోజుకొకరిపై తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్నారన్నారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారని... త్వరలోనే చంద్రబాబుకు బుద్ధి చెబుతారని చెప్పారు. రేణుగుంట ఎయిర్పోర్టులో ఓ వేళ మిథున్రెడ్డి దాడి చేసి అక్కడే ఉన్న కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) కేసు పెట్టి ఉండేది కాదా అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు తిరుపతికి వచ్చాకే మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే కుట్రలు జరుగుతున్నాయని వైఎస్ జగన్ మండిపడ్డారు.

మరిన్ని వార్తలు