'బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు'

10 Jan, 2016 18:53 IST|Sakshi
'బాబు పాలన మూడు ముక్కల్లో చెప్పొచ్చు'

అనంతపురం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పాలనను మూడు ముక్కల్లో చెప్పవచ్చని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. చంద్రబాబు పాలన అంతా కూడా మోసం మోసం మోసం పద్దతుల్లోనే జరుగుతోందని అన్నారు. ఆంధ్రప్రదేశ్ లోని అన్ని వర్గాల ప్రజలను చంద్రబాబునాయుడు మోసం చేశారని అన్నారు.

ఆదివారం అనంతపురం జిల్లాలోని బండమీదపల్లిలో నిర్వహించిన రైతు భరోసా యాత్ర బహిరంగ సభలో వైఎస్ జగన్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలేమిటో, ఎన్నికలు పూర్తయ్యి ముఖ్యమంత్రి అయ్యాక చేస్తున్న చేతలేమిటో ప్రజలు గమనించి గట్టిగా ప్రశ్నించాలని అన్నారు. మోసపూరిత హామీలు ఇవ్వడం వల్లే వాటిని నమ్మి అమాయక రైతులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని చెప్పారు. ఓపక్క రైతులంతా ఇబ్బందులు పడుతూ కష్టాల్లో మగ్గుతూ ఆత్మహత్యలకు పాల్పడుతుంటే చంద్రబాబుకు అవేం కానరావడం లేదన్నారు.

సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా రైతులు సంతోషంగా ఉన్నారని అబద్దాలు ఆడారని చెప్పారు. ఎన్నికల సమయంలో లైట్లు పెట్టి మరీ ప్లెక్సీలు కట్టారని, పెద్ద పెద్ద అక్షరాలతో మోసపూరిత హామీలు రాశారని గుర్తు చేశారు. రైతుల రుణ మాఫీలు కావాలన్నా, డ్వాక్రా రుణాలు మాఫీ కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా బాబు రావాలంటూ ప్లెక్సీలు పెట్టారని తీరా ముఖ్యమంత్రి పదవి వచ్చిన తర్వాత ఆ హామీలు మరిచారని అన్నారు. రాష్ట్రంలో గుడిసె లేకుండా చేస్తానని, అన్ని పక్కా ఇళ్లు కట్టిస్తానని చెప్పారని, ఒక్క ఇళ్లయినా కట్టించారా అని నిలదీశారు.
            ఇంకా ఏమన్నారంటే..

  • చంద్రబాబు పాలన గురించి మూడు ముక్కల్లో చెప్పవచ్చు..
  • ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు రూ.5లక్షలు ఇస్తామని ఒక్క రూపాయి ఇవ్వలేదు
  • రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశారు
  • పావలా వడ్డీలు రద్దు చేసి అదనంగా 14శాతం అపరాధ వడ్డీ వసూలు చేస్తున్నారు.
  • వడ్డీల్లో మూడో వంతు కూడా రుణమాఫీ చేయలేదు
  • వడ్డీలకు కూడా సరిపోని మాఫీలు చేసి మొత్తం రుణాలు మాఫీ చేసినట్లు మభ్య పెడుతున్నారు.
  • అక్కా చెల్లెళ్ల రుణాల మాఫీ చేస్తానని చెప్పి వారిని మోసం చేశారు
  • జాబురావాలంటే బాబు రావాలని చెప్పి యువతను మోసం చేశారు.
  • రూ.2000 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పి మోసం చేశారు
  • అందరి ఇళ్లలో కలర్ టీవీలు పెట్టిస్తానని మోసం చేశారు.
  • బాబు పాలన ప్రతి అడుగులో మోసం మోసం మోసం మాత్రమే ఉంది
  • కరువు సమయంలో ఇన్ పుట్ సబ్సిడీ ఇస్తామని చెప్పి మరోసారి మోసం చేశారు
  • తుఫానులు,కరువు వస్తే ప్రతిఒక్కరిని ఆదుకుంటామని చెప్పి మోసం చేశారు
  • వరదలు వచ్చాక 163 కరువు మండలాలు ప్రకటించారు
  • ముందే కరువు మండలాలు ప్రకటించి ఉంటే కేంద్రం నుంచి నిధులు వచ్చేవి
  • చంద్రబాబు ముందే కరువు మండలాల జాబితా ఇచ్చి ఉంటే ప్రజలకు ఇన్ పుట్ సబ్సిడీ వచ్చి ఉండేది
  • శ్రీశైలంలో కనీస నీటి మట్టం లేకుండానే ఎలా రాయలసీమకు నీళ్లు ఇస్తారో చెప్పాలి.
  • రాయలసీమకు నీరు రావాలంటే శ్రీశైలంలో 854 అడుగుల నీటిమట్టం ఉండాలి.
  • కానీ, బాబు కేసీఆర్ కలిసి విద్యుత్ పేరిట 790 అడుగులకు తీసుకొచ్చారు
  • డీఎస్సీ రాసిన అభ్యర్థుల నోట్లో చంద్రబాబు మట్టి కొట్టారు
  • ఇవాళ అంగన్ వాడీలు, ఆదర్శ రైతులు, ఫీల్డ్ అసిస్టెంట్లు రోడ్డున పడ్డారు

మరిన్ని వార్తలు