'వైఎస్ జగన్ విజయం సాధించారు'

11 Oct, 2015 09:42 IST|Sakshi
'వైఎస్ జగన్ విజయం సాధించారు'

గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా ఆవశ్యకత, అవసరం, దానివల్ల వచ్చే ప్రయోజనాలను ప్రజలకు వివరించడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయం సాధించారని విద్యార్థులు, మహిళలు, వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన మద్దతుదారులు అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం వైఎస్ జగన్ చేస్తున్న దీక్ష ఐదో రోజుకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా దీక్ష ప్రాంగణానికి చేరుకుంటున్న వారంతా మీడియాతో మాట్లాడింది. నేడు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ చేస్తున్న దీక్షపై చర్చ జరుగుతోందని, ప్రతి ఇంట్లో ఆయన నిరాహార దీక్ష గురించే మాట్లాడుకుంటున్నారని వారు పేర్కొన్నారు. ప్రత్యేక హోదాపై ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు సంపూర్ణ అవగాహన వచ్చిందని, ఇది ఓ రకంగా వైఎస్ జగన్ సాధించిన విజయమని వారు చెప్పారు.

ఇప్పుడు ప్రతి ఒక్కరి నుంచి దీక్షకు  మద్దతు లభిస్తోందని, ప్రతి ఒక్కరూ దీక్షా ప్రాంగాణానికి బయలుదేరి వస్తున్నారని, ఈ ప్రభుత్వాన్ని తీవ్ర స్థాయిలో ప్రశ్నించేందుకు సిద్ధమవుతున్నారని పేర్కొన్నారు. అబద్ధాల యూనివర్సిటీలో పీహెచ్డీ చేసిన చంద్రబాబునాయుడు ప్రత్యేక ప్యాకేజీ గురించి మాట్లాడుతున్నారని, దాని వల్ల బాబు కుటుంబమే బాగుపడుతుంది తప్ప రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేమి లేదని చెప్పారు. వైఎస్ జగన్కు ఏదైనా జరిగితే సహించేది లేదని, మంత్రులను తిరగనివ్వబోమని, క్యాంపు ఆఫీసులను, వారి పార్టీ కార్యాలయాలను ముట్టడించి తీరుతామని చెప్పారు. విద్యార్థులను కలుపుకొని ముందుకు వెళతామని, విద్యార్థులతో పెట్టుకున్న ఏ ప్రభుత్వం నిలవలేదనే విషయం తెలుసుకోవాలని వారు హెచ్చరించారు?

మరిన్ని వార్తలు