'చంద్రబాబు వద్దని జనం గగ్గోలు'

13 Feb, 2016 11:04 IST|Sakshi
'చంద్రబాబు వద్దని జనం గగ్గోలు'

శ్రీకాకుళం: ముఖ్యమంత్రి అంటే ఇలా ఉండాలని దివంగత మహానేత వైఎస్ఆర్ చాటిచెప్పగా, చంద్రబాబు లాంటి సీఎం వద్దని ప్రజలు గగ్గోలు పెడుతున్నారని వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్షనేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అన్నారు. శనివారం శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చిన జగన్ పలు కార్యక్రమాల్లో పాల్గొనున్నారు.

పైడిభీమవరంలో జగన్ ప్రసంగిస్తూ.. చంద్రబాబు మోసపూరిత వాగ్ధానాలను ఎండగట్టారు. 'ఎన్నికలకు ముందు రుణాలన్నీ మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. బ్యాంకులో తాకట్టు ఉన్న బంగారం ఇంటికి రావాలంటే బాబుకు ఓటేయాలన్నారు. అధికారంలోకి వచ్చాక హామీలన్నింటినీ విస్మరించారు. చంద్రబాటు అంతటి మోసగాడు దేశంలోనే లేడన్నమాట ప్రతి రైతు నోటా వినిపిస్తోంది. డ్వాక్రా అక్కచెల్లెమ్మలను అడిగితే తమ జీవితంలోనే ఇంతటి అన్యాయస్తుడిని చూడలేదంటున్నారు. ఎన్నికల సమయంలో జాబు రావాలంటే బాబు రావాలని టీడీపీ వాళ్లు టీవీల్లో ప్రచారం చేశారు. చంద్రబాబు సీఎం అయ్యాక కొత్త జాబులు రాకపోగా, ఉన్న జాబులను ఊడగొడుతున్నారు. నిరుద్యోగ భృతి ఏదని అడిగితే చంద్రబాబు ఖాళీ చేతులూపుతున్నారు. చంద్రబాబు పరిపాలన గురించి మూడు మాటల్లో చెప్పాలంటే మోసం, మోసం, మోసంలా ఉంది' అని జగన్ అన్నారు.

>
మరిన్ని వార్తలు